Modi Shah: వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే అయిదు స్టేట్ల ఎన్నికల్లో పరువు నిలుపుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. దీని కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు ఖరారు చేస్తోంది. ఇందులో భాగంగా విజయం సాధించాలంటే ఎలాంటి వైఖరులు పాటించాలనే దానిపై ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది. గతంలో లభించిన విధంగా విజయం అంత సులువు కాదనే విషయం తెలిసిపోతోంది. పైగా ప్రస్తుతం ప్రతిపక్షాలు బలపడుతున్నాయి. దీంతో బీజేపీకి గట్టి పోటీ అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరోవైపు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయం దక్కకపోతే వారిపై అనూహ్యంగా ఆగ్రహావేశాలు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సంఘ్ పరివార్ కూడా తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ప్రతికూలాంశాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
దేశంలో పెద్ద రాష్ర్టం ఉత్తర ప్రదేశ్. ఇక్కడ విజయం సాధిస్తే కేంద్రంలో అధికారంలోకి రావడం సులభమే. దీంతో ఇక్కడ విజయం సాధించాలనే అన్ని పార్టీలు ప్రణాళికలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఇక్కడే భారీ విజయం పొందాలని బీజేపీ భావిస్తున్నా అది అంత సులభం కాదనే విషయం నేతలకు తెలుస్తోంది. దీంతో పార్టీని ఎలా గట్టెక్కించాలనే దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
పీఎం మోడీ సొంత రాష్ర్టం గుజరాత్ లో కూడా విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. దీంతో తన శక్తియుక్తుల్ని ప్రదర్శించి విజయం సాధించాలని ఇరు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ పై కూడా పట్టు బిగించాలని బీజేపీ పావులు కదుపుతోంది.
ఉత్తరప్రదేశ్ అధికారానికి దూరమైతే కేంద్రంలో అధికారం సాధ్యం కాకపోవచ్చు. అందుకే సర్వశక్తులూ ఒడ్డి ఇక్కడ విజయం అందుకోవాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా నియంతృత్వ ధోరణిలో వెళ్లకుండా అందరిని కలుపుకుని వెళ్లాలని ఆలోచిస్తోంది.