Rangamarthanda: రెండేళ్ల క్రితం మొదలైంది ‘రంగమార్తాండ’. కానీ ఇంతవరకు ఈ సినిమాకి శుభం కార్డు వేయలేకపోయాడు కృష్ణవంశీ. కారణాలు ఏమైనా కావొచ్చు.. ఒక చిన్న సినిమాని కూడా మూడేళ్లు తీస్తే… నిర్మాతల పరిస్థితి ఏమిటి ? అందుకే, ఆ మధ్య ‘రంగమార్తాండ’ మధ్యలోనే ఆగిపోయింది అంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ, నిజానికి ఈ సినిమా ఆగిపోలేదు. ఆగుతూ సాగుతూ ఉంది. దర్శకుడు కృష్ణవంశీ కాబట్టి.. షూటింగ్ లో వేగం లేదు, ప్లానింగ్ లో క్లారిటీ లేదు.

ఇక తాజాగా మళ్ళీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అన్నట్టు మొదలు పెట్టిన ఈ షూటింగ్ లో ఒక సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఇంతకీ సాంగ్ ఎవరి మీదో తెలుసా ? ‘రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక’ల పై.. వీరిద్దరి మధ్య ఒక డ్యూయెట్ ఉంటుంది సినిమాలో. ఇప్పుడు దాన్నే షూట్ చేస్తున్నారు. ఇక ‘రంగమార్తాండ’ ఈ టైటిల్ వినడానికి చాలా వినసొంపుగా ఉంది.
పైగా క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణవంశీ తన శక్తిని అంతా ధారపోసి ఈ సినిమాని తీస్తున్నాడు. కాబట్టి.. సినిమాలో మ్యాటర్ ఉంటుంది అంటున్నారు. అందుకే సినిమా పై కూడా అంచనాలు క్రియేట్ అయ్యేలా ఉన్నాయి. అన్నిటికీ మించి ఈ సినిమాకి నలుగురు రచయితలను పెట్టుకున్నాడు. కృష్ణవంశీ సినీ కెరీర్ లోనే ఈ సినిమా కోసం తీసుకున్నన్నీ జాగ్రత్తలు, మరో సినిమాకి తీసుకోలేదట.
ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన జంట. సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యువ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ యువ జంటగా కనిపిస్తారు. అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. కాగా ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా బలమైనదట, పైగా కృష్ణవంశీ ఈ పాత్రను చాల ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. మొత్తానికి పాత్ర బలంగా ఉండటంతో అనసూయ నటన చాలా బాగా ఎలివేట్ అవుతుందని తెలుస్తోంది.