https://oktelugu.com/

PM Modi: తెలంగాణపై బీజేపీకి ఆశలు పెరిగాయా..? మోడీ వాఖ్యల వెనుక ఆంతర్యం అదేనా..?

టీ-బీజేపి అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇటివల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాము 8 ఎంపీలనే గెలుచుకోవచ్చు..కానీ,భవిష్యత్ లో ఈ 8 సీట్లే 88 సీట్ల గెలుపుకు మార్గం సుగమం చేయొచ్చన్నారు. శుక్రవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఎన్డీఏ భాగస్వామిక పక్షాల సమావేశం జరిగింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : June 7, 2024 / 04:13 PM IST

    PM Modi

    Follow us on

    PM Modi: తెలంగాణఫై బీజేపీకి ఆశలు పెరిగాయా..? రెండు రోజుల క్రితం ఆ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి.. తాజాగా నరేంద్ర మోడీ వాఖ్యల వెనుక ఆంతర్యం అదేనా..? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే..అవుననే అనిపిస్తోంది. 2014లో బీజేపీ ఒక్క ఎంపీ సీటునే గెలుచుకుంది. కేవలం పది శాతం ఓటు బ్యాంక్ నే సాధించగల్గింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఒక్కరే గెలుపొందారు. అప్పట్లో ఇతర అన్ని స్థానాల్లో ఆ పార్టీ ఘోర ఓటమిని మూట గట్టుకుంది. ఇక 2019కి వచ్చేసరికి బీజేపీ పరిస్థితి కాస్త మెరుగుపడింది. 4 ఎంపి సీట్లను సాధించింది. 16 శాతం ఓట్లను రాబట్టింది.

    ఇక ఈసారి ఏకంగా 08 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ఏకంగా బీజేపీకి 36 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. అయితే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా దానికుండే సమస్యల కారణంగా అంత పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చని అందరూ అనుకున్నారు. కానీ,2024 శాసన సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 మంది ఎంఎల్ఏలను గెలుచుకోవడం.. లోక్సభ ఎలక్షన్స్ లోనూ 8 సీట్లలో విజయం సాధించడంతో కమలనాథులకు తెలంగాణపై ఆశలు పెరిగినట్లె కనిపిస్తోంది.

    టీ-బీజేపి అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇటివల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాము 8 ఎంపీలనే గెలుచుకోవచ్చు..కానీ,భవిష్యత్ లో ఈ 8 సీట్లే 88 సీట్ల గెలుపుకు మార్గం సుగమం చేయొచ్చన్నారు. శుక్రవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఎన్డీఏ భాగస్వామిక పక్షాల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక,తెలంగాణ ఈసారి బీజేపిని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో తమ పార్టీ బలోపేతం గురించి ప్రయత్నాలుంటాయన్నారు. అయితే ఇటివల టిబిజెపి స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కామెంట్స్..తాజాగా మోడీ వ్యాఖ్యలను పరిశీలిస్తే రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమనే ధీమా వారిలో కనిపిస్తోంది. చూడాలి మరి బీజేపీ ఆశలు ఎలా ఉన్నా.. రానున్న కాలంలో ప్రజలు ఆ పార్టీని ఎలా ఆశీర్వదిస్తారనేది.