HDFC Bank: ఆ బ్యాంకు ఖాతాదారులు అలర్ట్.. ఈ సేవల్లో జాప్యం..

దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ నెట్ వర్క్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తమ అకౌంట్ హోల్డర్స్ కు అలర్ట్‌ జారీ చేసింది. బ్యాంక్ ప్లాట్‌ఫారమ్‌ల నిర్వహణలో భాగంగా సేవల్లో కొంత అంతరాయం ఏర్పడనుందని సూచించింది.

Written By: Neelambaram, Updated On : June 7, 2024 4:06 pm

HDFC Bank

Follow us on

HDFC Bank: కొన్ని సార్లు సాంకేతిక లోపం, సర్వర్ల అప్ గ్రేడ్ తో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇలాంటి పనులు బ్యాంకులు ఎప్పుడూ వీకెండ్స్ లో మాత్రమే పెట్టుకుంటాయి. ఎందుకంటే సెలవులు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని సార్లు అత్యవసరం అవుతుంది అలాంటి సమయంలో అంతరాయం కలుగక తప్పదు.

తమ సర్వీసులను మెరుగు పరిచేందుకు సర్వర్లను అప్‌గ్రేడ్‌ చేస్తుంటాయి బ్యాంకులు. దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ నెట్ వర్క్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తమ అకౌంట్ హోల్డర్స్ కు అలర్ట్‌ జారీ చేసింది. బ్యాంక్ ప్లాట్‌ఫారమ్‌ల నిర్వహణలో భాగంగా సేవల్లో కొంత అంతరాయం ఏర్పడనుందని సూచించింది. ఈ మేరకు ఈ మెయిల్‌ ద్వారా సందేశాలను పంపినట్లు బ్యాంకు స్పష్టం చేసింది. బ్యాంకు సేవలు జూన్ 9వ తేదీ, జూన్ 16 తేదీల్లో సిస్టమ్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా కొన్ని సేవల్లో అంతరాయం ఏర్పడనుందని తెలిపింది.

* జూన్‌ 9వ తేదీ ఉదయం 3.30 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు
* జూన్‌ 16వ తేదీ ఉదయం 3.30 గంటల నుంచి ఉదయం 7.30 గంటల వరకు (4 గంటలు) పాటు నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లో అందుబాటులో ఉండవని తెలిపింది.

ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించి సహకరించాలని ఒక ప్రకటనలో కోరింది. బ్యాంక్ సర్వీస్‌ సిస్టమ్స్‌ అప్‌గ్రేడ్‌ తర్వాత సేవలు యధావిధిగా కొనసాగుతాయని బ్యాంక్ మేనేజ్ మెంట్ తెలిపింది.

ఈ అంతరాయం కారణంగా అందుబాటులో ఉండని సేవలు
* డిపాజిట్లు
* నిధుల బదిలీలు (IMPS, NEFT, RTGS)
* ఖాతా స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్లు
* తక్షణ ఖాతా తెరవడం
* వ్యాపారి చెల్లింపు సేవలు
* యూపీఐ చెల్లింపులు

బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ వీటిని గుర్తుంచుకొని బ్యాంకుకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. వీలైనంత వేగంగా, ఇబ్బంది కలగకుండా అప్ గ్రేడ్ కంప్లీట్ చేస్తామని తెలిపింది. అప్ గ్రేడ్ తర్వాత తమ సేవలు యధావిధిగా కొనసాగుతాయని బ్యాంకు అధికారులు తెలిపారు.