Modi: మోడీకి అసలు పరీక్ష అదే..? అక్కడ ఓడితే ఆయనకు కష్టాలే..?

మరోవైపు వచ్చే ఏడాది ఢిల్లీ,బీహార్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాదిలో ఉన్న ఈ రెండు రాష్ట్రాలు కూడా బిజెపికి అత్యంత కీలకమైనవి. వచ్చే సంవత్సరం ఈ రాష్ట్రాల శాసనసభలకు ఎలక్షన్స్ జరగనున్నాయి.

Written By: Neelambaram, Updated On : June 7, 2024 5:00 pm

Modi

Follow us on

Modi: మోదీ నాయకత్వంలో ఈసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి 240 స్థానాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కు కొద్ది దూరంలో ఆ పార్టీ ఆగిపోయింది. అయితే మోడీ చరిష్మాతో ఎన్నికల బరిలోకి దిగిన కమలం పార్టీ ఈసారి లోక్ సభకు జరిగిన ఎలక్షన్స్ లో ఆ పార్టీ అనుకున్నన్ని స్థానాలను దక్కించుకోలేకపోయినా..మోడీ ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి బిజెపి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా..రానున్న రోజుల్లోనే మోడీ అగ్నిపరీక్షను ఎదుర్కొనున్నారు. ఈ సంవత్సరం, వచ్చే ఏడాది కీలకమైన రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఏడాది హర్యానా,మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో బిజెపి చాలా బలీయంగానే ఉంది. హర్యానాలో మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంది. ఇక మహారాష్ట్ర విషయానికొస్తే గతంలో అత్యధిక లోక్సభ స్థానాలు గెలుచుకున్నప్పటికిని..ఈసారి మాత్రం భంగపాటు తప్పలేదు. అయితే ఈ ఏడాది జరగనున్న పై రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బిజెపి తన సత్తాను చాటి అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేయక తప్పని పరిస్థితులున్నాయి. మహారాష్ట్ర నుంచి ఈసారి తక్కువ స్థానాలను సాధించిన బిజెపి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధిక స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే.. ఆ స్టేట్ లో బిజెపి బలమైన శక్తిగా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. ఇక హర్యానాలోనూ బిజెపి తన ఆధిక్యతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ రెండు రాష్ట్రాల్లో బిజెపిని ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నరేంద్ర మోడీ ఏ విధంగా గెలిపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ రెండు రాష్ట్రాల్లో బిజెపికి కనుక ఎదురు దెబ్బ తగిలితే అది పరోక్షంగా నరేంద్ర మోడీకి ఇబ్బందికరంగా మారనుంది. ఇప్పటికే ఆయన ప్రభావం లోక్సభలో బిజెపికి తక్కువ సీట్లు వచ్చిన కారణంగా కాస్త తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర,హర్యానాలో కూడా బిజెపి గెలవలేకపోతే ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మరోవైపు వచ్చే ఏడాది ఢిల్లీ,బీహార్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాదిలో ఉన్న ఈ రెండు రాష్ట్రాలు కూడా బిజెపికి అత్యంత కీలకమైనవి. వచ్చే సంవత్సరం ఈ రాష్ట్రాల శాసనసభలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో కూడా బిజెపిని గెలిపించాల్సిన బాధ్యత మోడీ పైన ఉంటుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీలో బిజెపి క్లిన్ స్విప్ చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అలాంటి పరిస్థితి ఉండవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆప్ నుంచి శాసనసభ ఎన్నికల సందర్భంగా బిజెపికి గట్టి పోటీ తప్పదు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ ఎలాంటి వ్యూహంతో ఆయా రాష్ట్రాల్లో కాషాయ జండా ఎగరవేయగలుగుతారనేది ఇంట్రెస్ట్ గా మారింది. ఒకవేళ దేశ రాజధానిలో భంగపాటు ఎదురైతే నరేంద్ర మోడీ నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరగొచ్చు అని అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే జరిగితే రాబోయే రోజుల్లో ఆయనను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించి మరో వ్యక్తికి ఆ బాధ్యతలను ఆర్ఎస్ఎస్ అప్పగించొచ్చనే ప్రచారమూ జరుగుతుంది. నితిన్ గడ్కారీ లాంటివారు ఇప్పటికే ప్రధానమంత్రి పీఠం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని వారి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి రాబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అనేటివి నరేంద్ర మోడీ నాయకత్వ పటిమకు దర్పణం కానున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ ను మోడీ ఎలా ఫేస్ చేస్తారనేది మాత్రం చూడాల్సిందే మరి.