https://oktelugu.com/

మోడీ కేబినెట్ లోకి వీరికి లక్కీచాన్స్?

ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణకు నడుం బిగించారు. కేబినెట్ విస్తరణపై కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కేంద్ర మంత్రులతో ప్రధాని రెండుసార్లు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు త్వరలో తెర దించనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకునే వారికి ఏ పదవులు కేటాయించాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఈసారి పలువురు మంత్రివర్గంలో చోటు దక్కించుకోవచ్చనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆశావహులు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత […]

Written By: , Updated On : June 18, 2021 / 06:09 PM IST
Follow us on

Modiప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణకు నడుం బిగించారు. కేబినెట్ విస్తరణపై కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కేంద్ర మంత్రులతో ప్రధాని రెండుసార్లు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు త్వరలో తెర దించనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకునే వారికి ఏ పదవులు కేటాయించాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఈసారి పలువురు మంత్రివర్గంలో చోటు దక్కించుకోవచ్చనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆశావహులు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు.

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరుగుతుండడం తొలిసారి కావడం గమనార్హం. రాంవిలాస్ పాశ్వాన్, సురేష్ అంగాడి మరణంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. అలాగే ఎన్డీఏ నుంచి వైదొలిగిన అకాలీదళ్ కు చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. దీంతో కొత్తవారికి పలువురికి అవకాశం రానుందని తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఇచ్చే సందర్భంలో ఎవరెవరికి పదవులు దక్కుతాయో చూడాల్సిందే.

త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ర్టాలకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు సమాచారం. గ్రామీణాభివృద్ధి శాఖను అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్చనాంద సోనోవాల్ కు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీ చేరిన మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సైతం మంత్రివర్గంలో చోటు దక్కనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన దినేష్ త్రివేదికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు తెలిసింది. రాజస్థాన్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు భూపేందర్ యాదవ్ కూడా మంత్రి వర్గంలో చేరనున్నారని తెలుస్తోంది.

మాజీ కేంద్ర మంత్రి మేనకాగాంధీ తనయుడు, ఫిలిబిత్ ఎంపీ వరుణ్ గాంధీని తొలిసారి మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. బీజేపీలో చేరిన ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి అశ్విని బైష్నబ్ కూడా మంత్రివర్గంలో రానున్నారని తెలిసింది. ఆర్టికల్ 360 రద్దు సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన లఢఖ్ ఎంపీ జమ్యంగ్ సెరింగ్ నంగ్యాల్ కూడా తొలిసారి మంత్రివర్గంలో చేరే అవకాశాలున్నాయి. మోడీ ప్రభుత్వం 2019 మే 30న రెండోసారి ప్రమాణ స్వీకారం చేసింది.