సోలార్ టెండర్లకు హైకోర్టు చెక్?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదివేల మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్ కోసం పిలిచిన టెండర్లను హైకోర్టు కొట్టేసింది. కేంద్రం నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా కొంతమందికే మేలు జరిగేలా టెండర్ నిబంధనలు రూపొందించినట్లుగా టాటా సంస్థ హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది. ప్రభుత్వం తప్పు చేసినట్లుగా నిర్ధారించింది. టెండర్లు కొట్టి వేసింది. తాజాగా మళ్లీ టెండర్లు పిలవాలని ఆదేశించింది. పవర్ ప్రాజెక్టు టెండర్లు కేంద్ర విద్యుత్ చట్టానికి విరుద్ధంగా ఉందని హైకోర్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. దీంతో […]

Written By: Srinivas, Updated On : June 18, 2021 8:08 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదివేల మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్ కోసం పిలిచిన టెండర్లను హైకోర్టు కొట్టేసింది. కేంద్రం నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా కొంతమందికే మేలు జరిగేలా టెండర్ నిబంధనలు రూపొందించినట్లుగా టాటా సంస్థ హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది. ప్రభుత్వం తప్పు చేసినట్లుగా నిర్ధారించింది. టెండర్లు కొట్టి వేసింది. తాజాగా మళ్లీ టెండర్లు పిలవాలని ఆదేశించింది. పవర్ ప్రాజెక్టు టెండర్లు కేంద్ర విద్యుత్ చట్టానికి విరుద్ధంగా ఉందని హైకోర్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ టెండర్లలో ఏదో గూడుపుఠాణికి పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

టీడీపీ ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన విద్యుత్ కు ప్రాధాన్యం ఇస్తే జగన్ అప్పటి ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేశారు. జగన్ సీఎం కాగానే వేదిక మీద నుంచే సంప్రదాయేతర విద్యుత్ రంగంలో చేసుకున్న ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. అందులో ఆయన చెప్పిన వాటిలో పాతికేళ్ల పాటు పీపీఏలు చేసుకోవడం దగ్గర్నుంచి విద్యుత్ రేటు వరకు చాలా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ పదివేల మెగావాట్ల సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుని టెండర్లు పిలవడం గమనార్హం.

అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోమాట మాట్లాడడం నాయకులకు అలవాటే. పీపీఏలు 30 ఏళ్ల పాటు ఒప్పందం చేసుకుంటామంటూ ప్రభుత్వం అంగీకరించింది. గత ప్రభుత్వం పాతికేళ్ల పాటు ఒప్పందం చేసుకుంటేనే అవినీతి అన్న వైసీపీ ఇప్పుడు ముప్పై ఏళ్ల పాటు ఒప్పందం చేసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. స్థిర చార్జీలతో పాటు గత ప్రభుత్వం కన్నా ఎక్కువ రాయితీలు ఇస్తామని టెండర్లలో పేర్కొన్నారు.

ప్రభుత్వం పిలిచిన టెండర్లలో కడపకు చెందిన ఓ కంపెనీకి అత్యధికం దక్కాయి. తర్వాత అదానీ పవర్ దక్కించుకుంది. దీని కోసం టెండర్ నిబంధనలు మార్చారు. చివరికి టాటా సంస్థ కోర్టుకెళ్లింది. దీంతో గతంలో చేసిన ఆరోపణల సంగతేమో కానీ అసలు దోపిడీ మాత్రం ఇక్కడ బయటపడిందనే ఆరోపణలు వినిసిస్తున్నాయి.