Republic Day: భారత దేశం గణతంత్ర దేశంగా అవతరించి 75 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో 2025, జనవరి 26 గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఎగురవేస్తారు. అతిపెద్ద రాజ్యాంగం కలిగిన భారత దేశంపై అనేక దేశాలకు గౌరవం ఉంది. మన దేశం కూడా సత్సంబంధాలు కొనసాగిస్తోంది. వ్యాపార, వాణిజ్య సంబంధాలు విస్తరిస్తోంది. ఈ క్రమంలో గణ తంత్ర వేడులకు కూడా మన మిత్ర దేశాల అధ్యక్షులు, ప్రధానులను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తోంది. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోంది. 75వ గణ తంత్ర వేడులకు ఇండోనేషియా అధ్యక్షుడిని మోదీ ఆహ్వానించారు. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆయనే ఎందుకంటే..
సుబియాంటో భారత్‌దేశం–ఇండోనేషియా సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. భారత్‌కు బ్రహ్మోస్ క్షిఫుణుల కొనుగోలుతోపాటు పలు రక్షణ ఒప్పందాలపై ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో దృష్టిసారించారు. దీనికి సంబంధించిన ఒప్పందం ఖరారైతే ఫిలిప్పీన్స్ తర్వాత భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిఫుణులు కొనుగోలు చేసిన రెండో దేశంగా ఇండోనేషియా నిలవనుంది.
తొలి వేడులకు ఆ దేశ అధ్యక్షుడు..
ఇదిలా ఉంటే.. 1050లో నిర్వహించిన భారత తొలి గణతంత్ర వేడుకలకు కూడా ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్ణో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసారి 75వ గణతంత్ర వేడులకు ప్రబోవో హాజరు కానున్నారు. ఆయన హాజరైతే ఇండోనేషియా సైనిక బృందం కూడా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటుందని తెలుస్తోంది. ఈ నేలాఖరులో బ్రెజిల్‌లో జరుగనున్న జీ–20 సదస్సు సందర్భంగా ప్రబోవో, ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది.