ప్రజాస్వామ్యాన్ని మోడీ సర్కార్ ఖునీ చేస్తోందట

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ రేంజ్లో ఫైరయ్యారు. బీజేపీ సర్కార్ నియంతృత్వ ధోరణిని అవలంభిస్తుందని మండిపడ్డారు. పార్లమెంటులో బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణపై రెండ్రోరోజులుగా పార్లమెంట్లో వాడివేడి చర్చ జరుగుతోంది. రైతుల సంక్షేమం కోసమే వ్యవసాయ సంస్కరణలో భాగంగా కేంద్రం మూడు బిల్లులను తీసుకొచ్చినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇటీవలే ఈ బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది. Also Read : రైతుల  శ్రేయస్సు కోసమే ఆ బిల్లులు -మోదీ కేంద్రం తాజాగా తీసుకొచ్చిన […]

Written By: NARESH, Updated On : September 21, 2020 7:34 pm
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ రేంజ్లో ఫైరయ్యారు. బీజేపీ సర్కార్ నియంతృత్వ ధోరణిని అవలంభిస్తుందని మండిపడ్డారు. పార్లమెంటులో బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణపై రెండ్రోరోజులుగా పార్లమెంట్లో వాడివేడి చర్చ జరుగుతోంది. రైతుల సంక్షేమం కోసమే వ్యవసాయ సంస్కరణలో భాగంగా కేంద్రం మూడు బిల్లులను తీసుకొచ్చినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇటీవలే ఈ బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది.
కేంద్రం తాజాగా తీసుకొచ్చిన మూడు బిల్లుల వల్ల రైతులకు నష్టం చేకూరుతుందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ బిల్లులను రాజ్యసభలో అడ్డుకునేందుకు విపక్ష పార్టీలు యత్నించాయి. తాజాగా రాజ్యసభలో ఈ బిల్లుపై వాడివేడీ చర్చ జరిగింది. ఈ బిల్లు సందర్భంగా రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో సభ నుంచి చైర్మన్ 8మంది సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. విపక్ష నేతలు బిల్లును అడ్డుకునేందుకు ఎంతప్రయత్నించినా సాధ్యం కాలేదు.

దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారత ప్రజాస్వామ్యం గొంతును నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పార్లమెంటులో ఈ బిల్లును పెట్టే ముందు కనీసం రైతులను కేంద్రం సంప్రదించలేదని ఆరోపించారు. ఈ బిల్లు నూటికి నూరుపాళ్లు రైతులకు వ్యతిరేకంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యసభలో 8మంది సభ్యులను ప్రభుత్వం సస్పెండ్ చేయడం బీజేపీ సర్కార్ దుహంకారానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం మోదీ సర్కార్ తీసుకొచ్చిన బిల్లులు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. కేంద్రం ఈ బిల్లులను అమలు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక దివాళా తీసిందన్నారు. తాజాగా  రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని తీవ్రస్థాయిలో రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.