ప్రభాస్ మూవీపై నాగ్ అశ్విన్ మరో అప్డేట్

‘బాహుబలి’ సీరీసుల తర్వాత ప్రభాస్ రేంజ్ వరల్డ్ వైడ్ గా మారింది. ‘బాహుబలి’లో అమరేంద్రగా బాహుబలిగా ప్రభాస్ నటించి మెప్పించాడు. ఈ మూవీ తర్వాత డార్లింగ్ ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిగణం ఏర్పడింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియానే సినిమాలనే చేస్తూ తన క్రేజ్ ను కంటిన్యూ చేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ బాలీవుడ్లో ఘనవిజయం సాధించింది. ప్రభాస్ యాక్షన్ కు ఉత్తరాది ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ […]

Written By: NARESH, Updated On : September 21, 2020 7:37 pm
Follow us on

‘బాహుబలి’ సీరీసుల తర్వాత ప్రభాస్ రేంజ్ వరల్డ్ వైడ్ గా మారింది. ‘బాహుబలి’లో అమరేంద్రగా బాహుబలిగా ప్రభాస్ నటించి మెప్పించాడు. ఈ మూవీ తర్వాత డార్లింగ్ ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిగణం ఏర్పడింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియానే సినిమాలనే చేస్తూ తన క్రేజ్ ను కంటిన్యూ చేస్తున్నారు.

‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ బాలీవుడ్లో ఘనవిజయం సాధించింది. ప్రభాస్ యాక్షన్ కు ఉత్తరాది ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూడా ప్యాన్ ఇండియా మూవీనే. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. రోమాంటిక్ ఎంటటైనర్ గా ఈ మూవీ రాబోతుంది. కరోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగు వాయిదా పడింది.

Also Read : ‘ర‌కుల్ ప్రీత్ సింగ్’.. మళ్ళీ అడవిలోకి  ! 

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ చేస్తుండగానే ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఒక మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభాస్ తో ఓ భారీ బడ్జెట్లో సినిమా తీస్తున్నారు. ప్రభాస్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ నటిస్తోంది. సైంటిఫిక్ కథాంశంతో భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

తాజాగా మూవీకి సంబంధించి కొత్త అప్డేట్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించాడు. లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ మూవీ కోసం పని చేయబోతున్నట్లు తెలిపారు. ఈ మూవీ కోసం ఆయన మెంటర్ గా పని చేస్తారని తెలిపారు. గతంలో ఆదిత్య-369 మూవీని తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు ఈ మూవీలో భాగంగా కాబోతున్నారని తెలిపారు.

నేడు సింగీతం శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్భంగా ప్రొడక్షన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్ మూవీలో ఆయన భాగంకావడం సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందని చిత్రయూనట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనకు చిత్రయూనిట్ పుట్టిన శుభాకాంక్షలు తెలిపింది.