
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గత ప్రభుత్వాలకు భిన్నంగా రైతుల సంక్షేమానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం రైతులకు చేరువ కావడానికి అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కూడా ఒకటి. రైతులకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఎవరైతే ఈ పథకం కింద చేరతారో వారి ఖాతాల్లో సంవత్సరానికి 6,000 రూపాయలు మూడు విడతల్లో జమ చేస్తోంది.
ఒక్కో విడతలో కేంద్రం రైతులకు 2,000 రూపాయలు చొప్పున ఇస్తోంది. గడిచిన రెండు సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ పథకం అమలు జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో రైతులకు సంబంధించి అనేక పథకాలు అమలవుతున్నా ఆ పథకాలతో సంబంధం లేకుండా కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మోదీ సర్కార్ అమలు చేస్తుండటం గమనార్హం. మరికొన్ని రోజుల్లో కేంద్రం మరో విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు విడతల డబ్బు రైతుల ఖాతాలలో జమ కాగా మరో విడత నగదు జమ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో రైతుల ఖాతాలలో మళ్లీ రెండు వేల రూపాయలు జమ కానున్నాయి. గతంలో నగదు జమ అయిన రైతులందరి ఖాతాలలో మరో విడత నగదు జమ కానుంది. అయితే అర్హులైనా నగదు జమ కాని రైతులు మరోమారు దరఖాస్తు చేసి నగదు పొందవచ్చు.
ఇప్పటివరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని రైతులు ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లో సరైన వివరాలను పొందుపరిచి ఈ పథకానికి అర్హత పొందవచ్చు. కేంద్రం రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో మరిన్ని పథకాలను అమలు చేస్తోంది.