
పాలల్లో యూరియా అవశేషాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఫుడ్‌సేప్టీ అధికారులు పాల విక్రయదారులను సోమవారం ఉదయం పరీక్షించారు. సూర్యపేట పట్టణానికి సమీప గ్రామాల నుంచి వచ్చే పాల నాణ్యతను పరీక్షించామని, ఇందులో ముగ్గురి వద్ద యూరియా అవశేషాలు ఉన్నట్లు గుర్తించామని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. మొత్తం 57 మంది నుంచి నమునాలు సేకరించామన్నారు. ఫుడ్‌సేప్టీ మొబైల్ వాహనంలో వచ్చిన అధికారులు పాల నాణ్యతను పరీక్షించారు. కాగా యూరియా అవశేషాలున్న పాలను మరిన్నీ పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించామన్నారు.