Homeజాతీయ వార్తలుమోదీజీ.. ఇక మీ మంత్రం పనిచేయదు..

మోదీజీ.. ఇక మీ మంత్రం పనిచేయదు..

Modi Govt
సుదీర్ఘ విరామం తరువాత బీజేపీ పుంజుకుని.. అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా మోదీ పీఠం ఎక్కినప్పటి నుంచి కమలం గుర్తుకు పోటీ లేకుండా పోయింది. 2014, 2019లో వరుగా బీజేపీ కేంద్రంలో తన పాలనను చేపట్టింది. ఇందుకు కారణం మోదీ అని చెప్పవచ్చు. అతనొక మాటల మాంత్రికుడు. అరచేతిలోనే వైకుంఠం చూపించే రాజకీయ తంత్రికుడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో మోదీకి బాగా తెలుసు. ఇందులో భాగంగానే గత రెండు పర్యాయాలుగా దేశ ప్రధానిగా విజయంతంగా ముందుకు సాగుతున్నారు.

Also Read: తమిళనాట.. రెండాకుల పంచాయితీ..

అయితే ఎన్నికల వేళ మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. గత ఏడేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఇటు పల్లెలు, అటు పట్టణాల్లో సైతం పర్టీ పట్ల వ్యతిరేకత కనిపిస్తోందంటున్నారు కొందరు. ఈ ఏడాది తమిళనాడు, అస్సాం, కేరళ, పురుచ్చేరి, పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరగనున్నాయి. తరువాత ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.

Also Read: పశ్చిమ బెంగాల్ లో రాజకీయ అస్త్రంగా ‘జైశ్రీరాం’ ఎందుకు మారింది?

ఈ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే అడ్డంకిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ప్రజల్లో మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం, నిత్యవసరాల ధరలు నింగిని అంటడం వంటి కారణాలతో ప్రజలు మోదీ ప్రభుత్వంపై అసహనంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ పెట్రోల్ ధరలను ఇంత పెంచలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

ఈ ప్రభావం రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అక్కడ మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం విశేషం. మున్సిపల్, కార్పొరేషన్ ప్రాంతాల్లో బీజేపీకి ఓటమికి కారణం ప్రధానంగా.. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడమే అన్నకారణాన్ని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ నేతలు సైతం ఇదే విషయాన్ని అధిష్టానానికి రిపోర్టు చేశారు. ఇదే పరిస్థితి ఇప్పుడు దేశమంతా రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక రైతుల సమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమమే నడుస్తోంది. కేవలం మాటలు, సూక్తులు చెప్పి.. ఆచరణలో పేద, మధ్య తరగతి ప్రజలను పట్టించుకోని మోదీ.. ప్రభుత్వంపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోతంది. అక్కడ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఏడేళ్ల పాటు మోదీ ప్రజలను భ్రమలో ఉంచారని.. ప్రజలకు చేసింది ఏమీ లేదనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనిని కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటే… భవిష్యత్తును హస్తగతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version