
యంగ్ రెబల్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్ వచ్చేసింది. ప్రేమికుల రోజు.. ప్రేమను మరింత పెంచుతూ ప్రేక్షకుల కోసం రిలీజ్ అయ్యింది. ఫుల్ ఆఫ్ లవ్ తో ఈ టీజర్ సందడి చేసింది.
రాధేశ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. అద్భుతమైన పచ్చని కొండల మధ్య నుంచి ఓ రైలు ఆహ్లాదంగా వస్తున్న సీన్ తో గ్లింపేజ్ ప్రారంభమైంది.
ఇక రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల మధ్య నుంచి ఎగిరి ఇటాలియన్ భాషలో పిలుస్తున్న లవర్ బాయ్ ప్రభాస్ లుక్ అమ్మాయిల మనుసుదోచేలా ఉంది.
ప్రభాస్ తన లవర్ పూజా హెగ్డేను పిలవగానే అమ్మాయిలందరూ చూసే చూపు కట్టిపడేస్తుంది. ఈ క్రమంలోనే హీరోయిన్ వాయిస్ తో ‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా?’ అని అడిగితే .. ‘వాడు ప్రేమ కోసం చచ్చాడు.. నేనా టైపు కాదు’ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ ప్రేమికులను గట్టిగా తాకుతోంది.
ఫ్రెష్ లవ్ రోమాంటిక్ టచ్ తో ‘రాధేశ్యామ్ ’ గ్లింప్స్ ఉందని అర్థమవుతోంది. ఈ గ్లింపేజ్ ఆకట్టుకునేలా ఉంది. సినిమా రిలీజ్ డేట్ ను కూడా చిత్రం యూనిట్ ప్రకటించింది. జులై 30న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
లవర్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం గ్లిప్స్ ను కింద చూడొచ్చు..
