https://oktelugu.com/

ఫిబ్ర‌వ‌రి 14న మోనాల్ స‌ర్ ఫ్రైజ్‌.. ఏంటో తెలుసా..?

తెలుగు బిగ్ బాస్ షో లో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు ఎపిసోడ్ లు ముగిశాయి. అయితే.. తొలి మూడు సీజ‌న్ల‌లో పాల్గొన్న‌వారికి పెద్ద‌గా ఒరిగింది ఏమీలేదు. కానీ.. ఈ నాలుగో సీజన్ లో పార్టిసిపేట్ చేసిన వారిలో చాలా మంది ఫేట్ మారింద‌నే చెప్పాలి. ఈ సీజన్ కు వచ్చిన భారీ హైప్ కార‌ణంగా.. అందులో పాల్గొన్న వారికి ఫుల్‌ క్రేజ్ ఏర్పడింది. దాంతో.. ఛాన్స్ లు కూడా క్యూ క‌డుతున్నాయి. ఇలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్‌ […]

Written By:
  • Rocky
  • , Updated On : February 14, 2021 / 10:17 AM IST
    Follow us on


    తెలుగు బిగ్ బాస్ షో లో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు ఎపిసోడ్ లు ముగిశాయి. అయితే.. తొలి మూడు సీజ‌న్ల‌లో పాల్గొన్న‌వారికి పెద్ద‌గా ఒరిగింది ఏమీలేదు. కానీ.. ఈ నాలుగో సీజన్ లో పార్టిసిపేట్ చేసిన వారిలో చాలా మంది ఫేట్ మారింద‌నే చెప్పాలి. ఈ సీజన్ కు వచ్చిన భారీ హైప్ కార‌ణంగా.. అందులో పాల్గొన్న వారికి ఫుల్‌ క్రేజ్ ఏర్పడింది. దాంతో.. ఛాన్స్ లు కూడా క్యూ క‌డుతున్నాయి. ఇలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్‌ మోనాల్ గజ్జర్ ఫ‌స్ట్ ప్లేస్ లోనే ఉంది. ఇప్ప‌టికే ప‌లు అవ‌కాశాలు చేజిక్కించుకున్న ఈ బ్యూటీ.. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ఓ స‌స్పెన్స్ పోస్ట్ పెట్టింది. అది ఏమైఉంటుందా? అని జుట్టు పీక్కుంటున్నారు ఫ్యాన్స్‌!

    తెలుగులో అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ చిత్రాల్లో చిట్టిపొట్టి నిక్క‌ర్లో యూత్ ను అట్రాక్ట్ చేసింది మోనాల్ గజ్జర్. ఆ తర్వాత ఒకటీ రెండు చిత్రాల్లో కనిపించినప్పటికీ వర్కవుట్ కాలేదు. ఆశించిన గుర్తింపు రాకపోవడంతో.. ఇతర లాంగ్వేజెస్ లో ట్రై చేసిందీ గుజరాత్ బ్యూటీ. కానీ.. అక్కడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. డీప్ ట్రబుల్స్ లో ఉన్న ఇలాంటి సమయంలో బిగ్ బాస్ నుంచి పిలుపు అందుకుంది మోనాల్.

    Also Read: ‘ఉప్పెన’ డిజిటల్ రిలీజ్ కూడా ఫిక్స్ !

    బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో మోనాల్ తన హాట్ లుక్స్ తో, తనదైన గేమ్ తో అందరి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకుందీ బ్యూటీ. మొద‌ట్నుంచే అందరితో మంచిగా మెలుగుతూ వచ్చిన గుజ‌రాత్ భామ‌.. ఈ క్రమంలోనే అభిజీత్‌కు బాగా దగ్గరైంది. కొన్నాళ్లపాటు అతడితో ట్రావెల్ చేసింది. ఆ త‌ర్వాత అఖిల్ సార్థక్‌తో కూడా క్లోజ్ అయింది. దీంతో.. ఇద్దరితో ట్రాక్ న‌డుపుతోందా? అని సందేహించారు ఆడియ‌న్స్‌.

    కానీ.. ఆ త‌ర్వాత అభిజీత్ ను వ‌దిలేసి.. అఖిల్ తో మ‌రింత ద‌గ్గ‌రైంది. అప్పటి నుంచి అతడితోనే ఉంటూ అతడి కోసమే గేమ్‌ ఆడుతూ హైలైట్ అయింది. అంతేకాదు.. నామినేషన్స్ స‌మ‌యంలో అఖిల్ ను కాపాడుతూ వచ్చింది. ఇక హగ్గులు, ముద్దుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఆ విధంగా ఫుల్‌ పాపులారిటీ సంపాదించింది మోనాల్‌. బిగ్ బాస్ టైటిల్ రాలేదుగానీ.. ఆ ఫేమ్ తో మంచి ఛాన్సులు మాత్రం కొట్టేసింది.

    Also Read: ‘మనోజ్ – బన్నీ’ కలయికలో ‘పుష్ప’ !

    హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘డ్యాన్స్+’ అనే షోకు జడ్జ్‌గా ఎంపికైంది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన‌ ‘అల్లుడు అదుర్స్’లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. అప్ప‌ట్నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న మోనాల్‌.. ఫాలోవర్లను పెంచుకుంటూ వ‌స్తోంది. వారితో త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు పంచుకుంటూ వ‌స్తోంది. కాగా.. లేటెస్ట్ గా ఫ్యాన్స్ ను స‌స్పెన్స్ లో ముంచేసింది మోనాల్‌.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టిన మోనాల్‌.. ఇంట్ర‌స్టింగ్ అప్డేట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించింది. అది కూడా వాలెంటైన్స్ డే ముందు రోజున పోస్ట్ చేసిన బ్యూటీ.. ఆ విషయం ఏంటన్నది మాత్రం ఫిబ్రవరి 14న ప్రకటిస్తానని సస్పెన్స్ మరింత హైక్ చేసింది. ‘‘గాయ్స్.. ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. రేపు మధ్యాహ్నం బిగ్ సర్‌ప్రైజ్. వెయిట్ చేయండి’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో.. తన లవ్ గురించి చెప్తుందా.. ఏంటి? అని డిస్క‌స్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. లేక ఏదైనా సినిమా గురించి అప్డేట్ ఇస్తుందా? అని కూడా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి.. మోనాల్ ఇచ్చే ఆ సర్ ఫ్రైజ్ కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.