Modi government criticism: నరేంద్ర మోడీ.. ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. దౌత్యం నుంచి మొదలుపెడితే.. పరిపాలన వరకు ప్రతిదాంట్లోనూ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు.. మరి కొంతమందికి నచ్చవచ్చు. అంతిమంగా మాత్రం దేశ ప్రజలలో మెజారిటీ వర్గం మాత్రం నరేంద్ర మోడీ నాయకత్వానికి జై కొడుతోంది.
నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మీద కేసులు పెరిగాయని.. అడ్డగోలుగా ఇబ్బంది పెడుతున్నారని.. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనేక సందర్భాలలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడానికి అంటే ముందు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ దేశాన్ని అత్యధిక సార్లు పరిపాలించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ వంటి వారు ఈ దేశానికి ప్రధాన మంత్రులుగా పని చేశారు.. అయితే ఇప్పుడు ఆ వారసత్వాన్ని రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నప్పటికీ.. వారి స్థాయిలో ప్రధానమంత్రి కాలేకపోతున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించినప్పటికీ.. అధికారాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది.
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన మార్పుల వల్ల కొంతమంది రాజకీయ నాయకుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. అవి ఎంతటి మార్పునకు దోహదం చేశాయంటే.. గతంలో తాము చేసిన పనులను ఆ నేతలు కూడా గుర్తుపెట్టుకోలేనంతగా మార్చేశాయి.
2014 కంటే ముందు సోనియా గాంధీ కి ఒక వ్యాధి ఉందని ప్రచారం జరిగేది. ఆ వ్యాధి చికిత్స కోసం ఆమె ప్రతి ఆరు నెలలకు ఒకసారి విదేశాలకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఆమె వ్యాధి చికిత్స కోసం విదేశాలకు అంతగా వెళ్లడం లేదు.
2014 కంటే ముందు ప్రియాంక గాంధీ తాను రూపొందించిన పెయింటింగ్ ను విక్రయించారు. దానిని యస్ బ్యాంక్ అధిపతి రానా కపూర్ 2.5 కోట్లకు దక్కించుకున్నారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎటువంటి పెయింటింగ్ వేయడం లేదు.
2014 కంటే ముందు మాయావతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆమెను వజ్రాలు.. కరెన్సీ నోట్లతో తూకం వేసేవారు. ఇప్పుడు ఆ తూకం సంగతి పక్కన పెడితే.. మాయావతిని ఎవరూ పట్టించుకోవడం లేదు.
2014 కంటే ముందు అఖిలేష్ యాదవ్ సై ఫై మహోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఇప్పుడు ఆ ఉత్సవాన్ని ఆయన నిర్వహించడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాబర్ట్ వాద్రా హర్యానాలో తక్కువ ధరకు కోట్ల రూపాయల విలువైన భూములను కొనుగోలు చేసేవారు. గత కొంతకాలంగా ఆయన ఎటువంటి క్రయవిక్రయాలు జరపడం లేదు.
2014 కంటే ముందు చిదంబరం తన వ్యవసాయ పొలాల్లో కోట్ల రూపాయల విలువైన పంటలు పండించేవారు. అయితే ఇప్పుడు ఆయన వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించిన వార్తలు బయటికి రావడం లేదు.
2014 కంటే ముందు ఏకే అంటోని భార్య తన పెయింటింగ్ లను ప్రభుత్వానికి ₹25 కోట్లకు విక్రయించారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె పెయింటింగ్ కూడా వేయడం లేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. దావూద్ ఇబ్రహీం.. చోటా రాజన్.. హాజీ మస్తాన్.. ఇంకా చాలామంది ఉగ్రవాదులు కనిపించకుండా పోయారు. కొంతమంది వార్తల్లో కూడా లేకుండా పోయారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. మోడీ అంటే రెండు అక్షరాల పదం మాత్రమే కాదు.. అంతకుమించిన విస్పోటనం. పైన చెప్పినవన్నీ కేవలం ఉదాహరణలు మాత్రమే.. లోతుగా వెళ్తే కథ చాలా ఉంటుంది.