Homeజాతీయ వార్తలుTribal Communities: హిందూ ధర్మంలోకి ఆదివాసీలు.. బలవంతపు మతమార్పిడులకు బ్రేక్‌!

Tribal Communities: హిందూ ధర్మంలోకి ఆదివాసీలు.. బలవంతపు మతమార్పిడులకు బ్రేక్‌!

Tribal Communities: ఒక వ్యక్తిని చంపితే అతని ఆశయాలు, ఆలోచనలు, ఆదర్శలు ఎప్పటికీ బతికే ఉంటాయి. హైందవ ధర్మం కోసం ఉదేశించినదే అయతే ఉద్యమం ఆగదు. 2008లో కృష్ణాష్టమి జరుగుతున్న సమయంలో ఒక ఆశ్రమంలో మావోయిస్టుల రూపంలో క్రైస్తవ ఉగ్రవాదులు ప్రవేశించి స్వామీజీని చంపేశారు. ఒక సాధారణ స్వామీజీ అతను ఎందుకు చంపేశారంటే హిందువులు మంతం మారకుండా చేశారు. ఆ స్వామీజీ పేరు లక్ష్మణానంద సరస్వతి. బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేశారు.

మతమార్పిడులను అడ్డుకుంటున్నాడని..
సాధారణ స్వామీగా కనిపించినా, స్వామీ గిరిజనులను సనాతన ధర్మంలో ఉంచి, మోసపూరిత మార్పిడులను అడ్డుకున్నారు. ఈ ప్రయత్నాలు కొన్ని సంస్థలకు అసహనం కలిగించాయి. హత్య తర్వాత కూడా ఆరోపితులు క్షమాపణ చెప్పకపోవటం వివాదాన్ని పెంచింది. ఆయన ఆలోచనలు హిందూ ఐక్యతకు పునాది వేశాయి.

Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?

తాజా పునరాగమనం..
మార్చి 21న తలహండి జిల్లాలో 136 గిరిజన కుటుంబాలు సనాతన ధర్మానికి తిరిగి వచ్చాయి. ధర్మజాగరణ్‌ సమన్వయ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థానిక నాయకుడు రాజు ప్రభల్‌ ప్రతాప్‌ సింగ్‌ పాదాలు కడిగి, ధార్మిక గ్రంథాలు అందజేశారు. భారీ ఊరేగింపు, ఉత్సవాలతో స్వాగతం చేశారు. ఇది స్వామీ ఆదర్శాలు జీవించి ఉన్నాభ అన్న సందేశాన్ని ఇస్తోంది.

కొనసాగుతున్న పోరాటం:..
కాందమార్, మయూర్‌లలో స్వామీ ప్రభావం బలంగా ఉంది. జనవరిలో 151 మంది హిందూ మార్గంలోకి వచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు ఒడిశా విస్తృతంగా జరుగుతున్నాయి. గిరిజనులు మత మార్పిడి ఒత్తిడులను తిరస్కరిస్తూ, స్వచ్ఛందంగా సనాతన ధర్మాన్ని ఎంచుకుంటున్నారు.

ఒక వ్యక్తి చనిపోయినా, ఆయన ఆదర్శాలు జీవించి ఉంటాయి. స్వామీ లక్ష్మణానంద హిందూ ధర్మ రక్షణకు చేసిన కృషి, గిరిజనుల్లో మూలాలు పుంజుకుంటోంది. మోస మార్పిడులు విఫలమవుతున్నాయి. ఈ ఉద్యమం హైందవ స్వాతంత్య్రానికి చిహ్నంగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version