Modi- Jagan: ప్రధాని మోదీ ఏపీని కరుణించారు. సంక్రాంతి కానుక ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ బందరు పోర్టుకు అనుమతులు జారీ చేశారు. మోదీ ఏపీకి మొండిచేయి చూపారని విమర్శలు వినిపిస్తున్న వేళ .. తీపివార్తను ఏపీ ప్రజలకు అందించారు. బందరు పోర్టుతో ఏపీ పారిశ్రామికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది.

ఏపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తీ కావొస్తోంది. ఏపీ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతోంది. అయినా కేంద్రం నుంచి ఏపీకి ఏం రావట్లేదన్న చర్చ బలంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి తన ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులు తాకట్టు పెట్టారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మచిలీపట్నం పోర్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ప్రాజెక్టుకు మంగళగిరిలో మారిటైమ్ బోర్డు వీడియో కాన్ఫరెన్స్ ద్వార కేంద్ర అధికారులతో జరిగిన చర్చల్లో అనుమతి లభించింది.
బందరు పోర్టు పర్యావరణ అనుమతులకు సంబంధించి కేంద్ర అధికారులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర అధికారులు సంతృప్త సమాధానాలు ఇచ్చారు. పలుమార్లు కేంద్రం బృందం పోర్టును పరిశీలించింది. దీంతో పోర్టు పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్ అయింది. బందరు పోర్టుకు అనుమతి లభించడంతో కృష్ణా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరగనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందనున్నారు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం రానుంది.

బందరు పోర్టుకు అనుమతులు ఇవ్వడం.. మోదీకి ఏపీ పై ఉన్న అభిమానానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇన్నేళ్లు కేంద్రం ఏం ఇవ్వలేదన్న వారి నోళ్లు మూతపడనున్నాయని అంటున్నారు. త్వరలో ప్రభుత్వం బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనుంది. బందరు పోర్టుతో ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. పోర్టు ద్వార ఎగుమతులు, దిగుమతుల వేగం పెరగనుంది. ఏపీ నుంచి జరిగే ఎగుమతులకు బందరు పోర్టు ద్వార ఎంతో లాభం చేకూరనుంది.