వీడియో కాన్ఫరెన్స్ లో మాస్క్ ధరించిన మోడీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు, ప్రధానంగా కరోనావైరస్ లాక్ డౌన్ ని ఏప్రిల్ 14 దాటి పొడిగించాలా..? వద్దా..? అనే దానిపై వివిధ రాష్ట్రాల సీఎం ల అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది, ఇందులో మరిన్ని వర్గాల ప్రజలు మరియు సేవలను మినహాయించాల్సిన అవసరం ఉందా. ప్రస్తుత లాక్ డౌన్ లో అవసరమైన సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తారా […]

Written By: Neelambaram, Updated On : April 11, 2020 3:18 pm
Follow us on


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు, ప్రధానంగా కరోనావైరస్ లాక్ డౌన్ ని ఏప్రిల్ 14 దాటి పొడిగించాలా..? వద్దా..? అనే దానిపై వివిధ రాష్ట్రాల సీఎం ల అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది, ఇందులో మరిన్ని వర్గాల ప్రజలు మరియు సేవలను మినహాయించాల్సిన అవసరం ఉందా. ప్రస్తుత లాక్ డౌన్ లో అవసరమైన సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.

గతంలో మార్చి 25 న లాక్ డౌన్ విధించినప్పటి నుండి వీడియో లింక్ ద్వారా ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో సంభాషించడం ఇది రెండోసారి, ఇప్పుడు ఆయన మాస్క్ ధరించి మాట్లాడటం
గమనార్హం.

ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కోవిడ్ -19 కేసులు విస్ఫోటనం చెందుతున్న రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగింపు కు ఆమోదం తెలిపారు.

ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాలు లాక్ డౌన్ ని ఈ నెల 30వరకు పొడిగిస్తున్నట్లు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రకటించారు.