https://oktelugu.com/

ఏపీకి మొండిచేయి.. మోడీ టీంలోకి 43 మంది

కేంద్ర ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేపట్టింది. కొత్తగా కేబినెట్ లోకి 43 మంది మంత్రులను తీసుకున్నారు. వారిలో తెలుగు ప్రాంతాల నుంచి ఒక్కరూ లేరు. దీంతో మనకు నిరాశే మిగిలింది. అయితే కేంద్ర మంత్రివర్గంలోకి సీఎం రమేశ్ ను తీసుకుంటారని ప్రచారం జోరుగా సాగినా చివరి నిమిషంలో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి జీవీఎల్ నరసింహారావుకు పదవి ఇస్తారని ప్రచారం జరిగినా ఆయనకు మొండిచేయి చూపారు. దీంతో తెలుగు వారికి ఏ ఒక్క పదవి కూడా దక్కకపోవడంపై నిరాశే […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 7, 2021 9:24 pm
    Follow us on

    కేంద్ర ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేపట్టింది. కొత్తగా కేబినెట్ లోకి 43 మంది మంత్రులను తీసుకున్నారు. వారిలో తెలుగు ప్రాంతాల నుంచి ఒక్కరూ లేరు. దీంతో మనకు నిరాశే మిగిలింది. అయితే కేంద్ర మంత్రివర్గంలోకి సీఎం రమేశ్ ను తీసుకుంటారని ప్రచారం జోరుగా సాగినా చివరి నిమిషంలో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి జీవీఎల్ నరసింహారావుకు పదవి ఇస్తారని ప్రచారం జరిగినా ఆయనకు మొండిచేయి చూపారు. దీంతో తెలుగు వారికి ఏ ఒక్క పదవి కూడా దక్కకపోవడంపై నిరాశే ఎదురవుతోంది.

    ప్రధాని మోడీ రెండోసారి అధికారం చేపట్టాక మొదటి సారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఇందులో తెలుగు వారు లేకపోవడంతో అందరిలో నైరాశ్యం కమ్ముకుంది. కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా పదోన్నతి దక్కడం ఒక్కడే ఊరట నిచ్చే అంశం. కర్ణాటక నుంచి నలుగురికి స్థానం కల్పించారు. ఒడిశా, తమిళనాడు నుంచి కూడా సముచిత స్థానం కల్పించారు.

    ప్రస్తుతం కేబినెట్ లోని పదిహేను మందికి ఉద్వాసన పలికి కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేశారు. తొలగించిన వారిలో సదానంద గౌడ, పోబ్రియాల్, హర్షవర్ధన్ వంటి వారు ఉన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఐదు స్టేట్ల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాటికి తగిన ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో అన్ని ప్రాంతాలకు స్థానం కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సామాజిక సమీకరణలు,సామర్థ్యాలను లెక్కలోకి తీసుకుని కేబినెట్ కూర్పు చేసినట్లు చెబుతున్నారు.

    దేశంలో ఏ ప్రభుత్వమున్నా ఏపీకి సముచిత స్థానం దక్కే క్రమంలో మొదటిసారి మంత్రి పదవి లేకుండా పోవడం గమనార్హం. వచ్చే ఎన్నికలను గుర్తించి మంత్రివర్గ విస్తరణలో వారికి అవకాశం కల్పించారు. తెలుగు ప్రాంతాల్లో ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో మనకు స్థానం దక్కలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా కేంద్ర మంత్రివర్గంలో మనకు ఉన్న ఒకే ఒక్క వ్యక్తి కిషన్ రెడ్డి. ఆయనకు మాత్రం కేబినెట్ హోదా కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.