https://oktelugu.com/

వైరల్: రాశిఖన్నా హాట్ ఎక్సర్ సైజ్

రాశిఖన్నా.. ఈ కరోనా లాక్ డౌన్ వేళ సినిమాలు ఏవీ లేకపోవడం.. షూటింగ్ లు జరపకపోవడంతో ఖాళీ టైంను సద్వినియోగం చేసుకుంటోంది. ఈ టైంలో జిమ్ చేస్తూ కండలు కరిగిస్తూ తన బాడీకి మెరుగులు దిద్దుకుంటోంది. నాజూకు జీరో ప్యాక్ ను సాధించేందుకు జిమ్ లో తెగ కష్టపడుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఊహలు గుసగుస లాడే `చిత్రం తో తెరంగేట్రం చేసిన రాసి ఖన్నా అందం, అభినయం రెండూ […]

Written By: , Updated On : July 7, 2021 / 10:23 PM IST
Follow us on

రాశిఖన్నా.. ఈ కరోనా లాక్ డౌన్ వేళ సినిమాలు ఏవీ లేకపోవడం.. షూటింగ్ లు జరపకపోవడంతో ఖాళీ టైంను సద్వినియోగం చేసుకుంటోంది. ఈ టైంలో జిమ్ చేస్తూ కండలు కరిగిస్తూ తన బాడీకి మెరుగులు దిద్దుకుంటోంది. నాజూకు జీరో ప్యాక్ ను సాధించేందుకు జిమ్ లో తెగ కష్టపడుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.

ఊహలు గుసగుస లాడే `చిత్రం తో తెరంగేట్రం చేసిన రాసి ఖన్నా అందం, అభినయం రెండూ ఉన్న కథానాయిక అనే చెప్పాలి. తొలి సినిమాలోనే ఆమె ఈ రెండు విషయాల్లో ప్రూవ్ చేసుకొంది. కానీ చేసింది చిన్న సినిమా కావడంతో పెద్ద సినిమాల్లో ఇంకా ఛాన్స్ రాలేదు. దాంతో సెకండ్ గ్రేడ్ హీరోయిన్‌గానే కొనసాగుతోంది. ఆ మధ్య ‘జై లవకుశ’ చిత్రం లో ఎన్ టి ఆర్ సరసన నటించినా కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది.

ఇక 2018 లో వచ్చిన ‘తొలి ప్రేమ’ మరియు 2019 లో వచ్చిన ” ప్రతిరోజూ పండగే” సినిమా లతో టాలెంటెడ్ అని ప్రూవ్ అయినా కానీ రాశి ఖన్నా కోరుకున్న స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. దరిమిలా తమిళంలోకి వెళ్లి చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది రాశి ఖన్నా. ఆ క్రమంలో తమిళ స్టార్ హీరో సూర్య సరసన ” ఆరువా ” అనే చిత్రం లో నటించబోతోంది. సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో రూపొందే ఈ ” ఆరువా ” చిత్రం లాక్ డౌన్ ఎత్తగానే ప్రారంభం అవుతుంది.. దీంతో పాటు ఖుష్బూభర్త సి . సుందర్ దర్శకత్వంలో ‘ఆరణ్మయి-3’ అనీ సినిమా కూడా ఆమె చేస్తున్నట్టు చెప్పింది..

తాజాగా ఈ సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడడంతో రాశిఖన్నా ఇంట్లోనే సేదతీరుతోంది. ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను రాశి తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియోకు పెద్ద సంఖ్యలో కామెంట్లు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.