Modi and KCR as Tollywood Brand Ambassadors: సీఎం కేసీఆర్ తెలుగు సినిమాల పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ “భాష – యాస”ల గురించి కేసీఆర్ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు తెలంగాణ యాసను కేవలం కమెడియన్లు మాత్రమే మాట్లాడేవారు అని, కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు చూడండి. ‘హీరో – హీరోయిన్లు’ కూడా తెలంగాణ యాసను మాట్లాడుతున్నారు.
ఇది తెలంగాణ భాషపై మనం సాధించిన పట్టు అని కేసీఆర్ చెప్పడం విశేషం. అసలు, తెలుగు చిత్రాల విజయానికి మన తెలంగాణ భాష ఒక ఆయువుపట్టు అయ్యింది. ప్రస్తుతం తెలంగాణ యాసను పెట్టిన చిన్న, పెద్ద సినిమాలు అన్ని అద్భుత విజయం సాధించాయి. మొత్తానికి తెలంగాణ యాస గురించి చెప్పి తెలంగాణ ప్రజల భావోద్వేగాన్ని మళ్ళీ సీఎం కేసీఆర్ తట్టిలేపారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఒక వ్యక్తి ఇలా సినిమాల్లో వాడే భాష గురించి ఇంత వివరంగా వివరించడం నిజంగా విశేషమే. మొత్తానికి సినిమా మాధ్యమానికి సీఎం కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పైగా పేద వాళ్లకు అందుబాటులో టికెట్లు రేట్లు అంటూ జగన్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ఇబ్బందుల పాలు చేస్తున్నా..
Also Read: కేసీఆర్ దెబ్బకు పాల డిపోలన్నీ ఖాళీ.. హోరెత్తుతున్న వాట్సాప్, ఫేస్ బుక్?
కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సినిమా ఇండస్ట్రీ పై అతి ప్రేమను చూపిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ సైతం హైదరాబాద్ విచ్చేసి.. తెలుగు సినిమా ఖ్యాతి గురించి చాలా గొప్పగా చెప్పాడు. మొత్తమ్మీద అప్పుడు మోడీ, ఇప్పుడు కేసీఆర్ తెలుగు సినిమా గొప్పతనానికి బ్రాండ్ అంబాసిడర్స్ గా మారిపోయారు.
ఏది ఏమైనా సృజనాత్మకతకు ఎప్పుడైనా తగినంత స్వాతంత్య్రం ఇస్తేనే, వెండితెరపై అద్భుతంగా వెలుగుతుంది. కేసీఆర్ ఈ విషయంలో జగన్ కంటే ముందంజలో ఉన్నాడు.
Also Read: బామ్మర్ధి జగన్ ను గెలిపించడానికి బరిలోకి బావ బ్రదర్ అనిల్!