https://oktelugu.com/

Tollywood: ఇరు రాష్ట్రాల సీఎంలకు థాంక్స్ – రాజమౌళి

Tollywood: సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ సర్కార్ జీవో తెచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ పరిశ్రమ సమస్యలను పరిష్కరించినందుకు రాజమౌళి ఇరు రాష్ట్రాల సీఎంలకు థాంక్స్ చెబుతూ… ట్వీట్ చేశారు. పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు సీఎం కేసీఆర్‌గారికి కృతజ్ఞతలు. కొత్త జీవో ద్వారా తెలుగు చలనచిత్ర వర్గానికి సహాయం చేసినందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, మంత్రి పేర్ని నానికి థాంక్స్ చెప్పారు రాజమౌళి. ఇది సినిమాల పునరుద్ధరణకు సహాయపడుతుందని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 9, 2022 / 03:33 PM IST

    Chiranjeevi

    Follow us on

    Tollywood: సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ సర్కార్ జీవో తెచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ పరిశ్రమ సమస్యలను పరిష్కరించినందుకు రాజమౌళి ఇరు రాష్ట్రాల సీఎంలకు థాంక్స్ చెబుతూ… ట్వీట్ చేశారు. పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు సీఎం కేసీఆర్‌గారికి కృతజ్ఞతలు. కొత్త జీవో ద్వారా తెలుగు చలనచిత్ర వర్గానికి సహాయం చేసినందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, మంత్రి పేర్ని నానికి థాంక్స్ చెప్పారు రాజమౌళి.

    Rajamouli

    ఇది సినిమాల పునరుద్ధరణకు సహాయపడుతుందని ఆశిస్తున్నానని ట్విట్ చేశారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించిన సంగతి తెలిసిందే. చిరు మాట్లాడుతూ.. ‘సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా నిర్ణయం తీసుకున్నారని, థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని టికెట్ల ధరలు సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేశారని కొనియాడారు.

    Chiranjeevi

    అందుకు సీఎం జగన్ కు చిత్ర పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చిరు వెల్లడించారు. అయితే, ఏపీలో 20% చిత్రీకరణ జరుపుకున్న చిత్రాలకే టికెట్‌ హైక్స్‌ ఉంటాయని జీవలో పేర్కొన్నారు. RRR, రాధేశ్యామ్‌ ఏపీలో 20% చిత్రీకరణ జరుపుకోలేదు. దీంతో ఈ రెండు చిత్రాలకి రికార్డు ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ కష్టమే అని భావించారు. అయితే ప్రస్తుతం వీటికి మినహాయింపు ఇస్తున్నామని, రాబోవు చిత్రాలు తప్పకుండా రూల్‌ని పాటించాలని పేర్ని నాని అన్నారు.

    Also Read: Pawan Kalyan Biography: బయోగ్రఫీ: రాజకీయమైనా.. సినిమాలైనా అది ‘పవన్’ఇజమే!

    కానీ మరోపక్క ఏపీలో సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోలో కొన్ని లొసుగులు ఉన్నట్టు పలువురు సినీ వ్యక్తులు అంటున్నారు. మరోవైపు చిరు, రాజమౌళి జగన్‌కి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అన్నట్టు మహేష్ బాబు, ప్రభాస్ లు కూడా జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.

    Also Read: Prabhakar Serial Actor Daughter: బుల్లి తెర ప్రభాకర్ కూతురు హీరయిన్ కి ఎ మాత్రం తీసుపోదు

    Tags