KCR Shocks To Opposition Party’s: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం ఉంది. ఇన్నాళ్లు ప్రతిపక్షాలు నిరుద్యోగుల పట్ల కేసీఆర్ సానుకూల వైఖరి అవలంభించడం లేదనే ఆరోపణలకు చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ఒకే సమాధానం చెప్పి వాటికి సరైన సవాలే విసిరారు. దీంతో ఏకంగా 91 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసి నిరుద్యోగుల్లో ఆశలు చిగురింపజేశారు. ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగవంతం చేస్తుందని చెబుతున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో పదేళ్ల వయోపరిమితి మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేకుండా చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ముందస్తు వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. యువతలో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకే కేసీఆర్ ఈ మేరకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: TS Teachers Promotion: ఉపాధ్యాయుల పదోన్నతులకు సీఎం గ్రీన్ సిగ్నల్
ప్రతిపక్ష నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల నిరుద్యోగ అంశంపై కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉండటంతో వారికి అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతోనే ఇలా చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న సీఎం కేసీఆర్ సొంత రాష్ట్రంలో ఏం సమస్యలు లేకుండా చేసి ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేసే ఉద్దేంతోనే నిరుద్యోగులకు తీపి కబురు చెప్పనున్నట్లు సమచారం.
ప్రతిపక్షాలకు ఓ అవకాశం పోయినట్లేనని తెలుస్తోంది. ముందస్తు వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ఇలా ముందుకు వెళ్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ తమ ప్రభుత్వానికి వ్యతిరేకత లేకుండా చూసుకుంటున్నారనే విషయం కూడా ప్రచారం సాగుతోంది. తదుపరి నిర్ణయం దేని మీద తీసుకుంటారో తెలియడం లేదు. కానీ కేసీఆర్ మాత్రం రాజకీయ వ్యూహంలో భాగంగానే నిరుద్యోగులకు వరాలు ప్రకటించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Also Read: Movie Ticket Rates: పేదలు సినిమాను ఇప్పుడెలా చూడాలి..? టిక్కెట్ల రేట్లు ఎవరి కోసం పెంచినట్లు..?