https://oktelugu.com/

కమల్ థర్డ్ ఫ్రంట్.. సీఎం అభ్యర్థి ఆయనే..

తమిళనాట జయలలిత మరణానంతరం రాజకీయాల రంగు వివిధ రకాలుగా మారింది. చాలా పరిణామాల తరువాత ఏదో ఒక విధంగా స్థిరమైన ప్రభుత్వం కొనసాగింది. అయితే తమిళనాట మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వివిధ పార్టీల నేతలు ఇప్పటికే తమ అస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా… సీనియర్ నటుడు కమల్ హాసన్ సైతం తనదారిలో తాను ఎన్నికలకు రెడీ అవుతున్నారు. తనను ఎవరూ పట్టించుకోకపోయినా.. సింగిల్ గా ముందుకు సాగుతున్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో తన బలంఏంటో తేలిపోవడంతో ఆయనతో […]

Written By: , Updated On : February 28, 2021 / 10:50 AM IST
Follow us on

kamal hassan
తమిళనాట జయలలిత మరణానంతరం రాజకీయాల రంగు వివిధ రకాలుగా మారింది. చాలా పరిణామాల తరువాత ఏదో ఒక విధంగా స్థిరమైన ప్రభుత్వం కొనసాగింది. అయితే తమిళనాట మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వివిధ పార్టీల నేతలు ఇప్పటికే తమ అస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా… సీనియర్ నటుడు కమల్ హాసన్ సైతం తనదారిలో తాను ఎన్నికలకు రెడీ అవుతున్నారు. తనను ఎవరూ పట్టించుకోకపోయినా.. సింగిల్ గా ముందుకు సాగుతున్నాడు.

పార్లమెంటు ఎన్నికల్లో తన బలంఏంటో తేలిపోవడంతో ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన పార్టీలు సైతం పెద్దగా సాహసం చేయడం లేదు. విడిగా పోటీ చేయడమే మంచిదని అటు అన్నా డీఎంకే కూటమి.. ఇటు డీఎంకే కూటమి కూడా భావించాయి. అందుకే ఆయనతో ఎలాంటి చర్చలు జరపలేదు. ఎవరూ ఏ కూటమిలోనూ చేర్చుకోలేకపోవడంతో ఏమనుకున్నారో ఏమో.. తానే ఓ కూటమి పెట్టేశారు కమల్ హాసన్.

Also Read: ఇండియాలో సెకండ్ వేవ్ మొదలైందా..? కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

ధర్డ్ ఫ్రంట్ పెట్టేశానని.. వచ్చేవారు తనతో చేతులు కలుపొచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారు కమల్. శరత్ కుమార్.. కమల్ హాసన్ తో కలిసి నడిచేందుకు సిద్ధం అయ్యారు. ఆయనకు కూడా పేరులేని ఓ పార్టీ ఉంది. కమల్ హాసన్.. రజినీకాంత్ తో పోటీగా ఫ్యాన్స్ ఉన్నప్పటికీ.. మాస్ ఇమేజ్ చాలా తక్కువ. దీంతో ఆయన పార్టీ పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదు.

Also Read: స్టేడియాలకు క్రికెటర్ల పేర్లు ఎందుకు పెట్టరు.? ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది?

మక్కల్ నీది మయ్యం పేరుతో ఆయన పెట్టిన పార్టీలోని కొంతమంది నేతలు ఇతర పార్టీలో చేరిపోయారు. రజినీకాంత్ పార్టీ పెడితే పొత్తుకు సిద్ధం అయ్యారు. కానీ.. రెడీ అని చెప్పిన తరువాత రజినీకాంత్ మిడిల్ డ్రాప్ అయ్యారు. దాంతో కమల్ కు ఇక ఒంటరిపోరు చేయక తప్పలేదు. ఒంటరిగా పోటీచేస్తే.. తాను అయినా గెలుస్తానా..? అనే టెన్షన్ ఉంది. అయినప్పటికీ.. కమల్ ఏమాత్రం నిరాశ చెందడం లేదు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

మూడో కూటమి తరఫున తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని ప్రకటించేసుకుని రంగంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి వర్సెస్ డీఎంకే కూటమిగా పోరు సాగుతోంది. శశికళ జైలు నుంచి విడుదలైనా.. ప్రస్తుత ఎన్నికల్లో అడుగుపెట్టే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదని అనిపిస్తోంది.