
బుల్లితెర స్టార్ యాంకర్ స్టెప్పులేస్తే ఒక గోడకట్టినట్టు.. ఓ మొక్కకు అంటుకట్టినట్టుగా నీట్ గా ఉంటుంది. ఆమె అందం, అభినయానికి బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడో బోల్డ్ అయ్యారు. అప్పుడో ఇప్పుడో వెండితెరపై కూడా అనసూయ సందడి చేస్తోంది. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా అనసూయ నటనలోనూ ఆకట్టుకుంది.
అయితే సినిమాల్లో ఆచితూచి నటిస్తున్న అనసూయ తాజాగా ఓ ఐటం సాంగ్ లో దుమ్ముదులిపేసింది. ‘పైన పటారం’ అంటూ సాగే ఐటం సాంగ్ లో చిందులతో కిర్రాక్ పుట్టించిందట..
గీతా2 సంస్థ కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి కాంబినేషన్లో నిర్మిస్తున్న చిత్రం ‘చావుకబురు చల్లగా’. ఈ సినిమాలో అనసూయతో ఓ హాట్ ఐటం సాంగ్ ప్లాన్ చేశారు. ఈ పాట తాజాగా వదలడంతో దుమ్మురేపుతోంది.
జానీ మాస్టర్ కాంపోజ్ చేసిన ఈ పాటలో అనసూయ ‘పైన పటారం’ అంటూ చిందులు మామూలుగా లేవు. కుర్రకారును థియేటర్స్ లో ఈలలు గోలలు చేసేలా ఉంది.
అయితే ఐటం సాంగ్ లు చేసే ఆలోచన తనకు లేదని.. కానీ గీతా సంస్థ అడగడం.. స్నేహితుడైన జానీ మాస్టర్ డ్యాన్స్ డైరెక్షన్ కావడంతో ఓకే చెప్పానని.. కానీ మళ్లీ మళ్లీ ఇలాంటి సాంగ్ లు చేసే ఉద్దేశం లేదని అనసూయ తెలిపింది.
మరి ఆ సాంగ్ ఎలా ఉందో చూసేద్దామా?
