ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలోని నిర్మాణాలు పూర్తి చేస్తామని.. రూ.3వేల కోట్లు తీసుకోవడానికి గ్యారంటీ ఇస్తామని ప్రకటించింది. తరువాత వైసీపీ నేతలు తమకు అమరావతిపై ఉన్న ప్రేమను వలకబోశారు. ఎంతో అనుమానం ఉన్నా.. అధికార పార్టీ కదా.. చేస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉండిపోయింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ నేతలు దీన్నే అస్ర్తంగా వాడుకుంటున్నారని.. అమరావతిని కట్టడం వారి ప్రభుత్వానికి చేతకాదని విపక్ష నాయకులు అంటన్నారు.
Also Read: విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి కేసులో సంచలన ట్విస్ట్
ఎవరివాదనలు ఎలా ఉన్నా.. హఠాత్తుగా శనివారం అమరావతిలో భూకంపం అంటూ.. అధికార పార్టీ వైసీపీ అధినేత మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. వైసీపీ సోషల్ మీడియా సైతం పోస్టులతో దుమ్ము లేపింది. అసలు ఏ మీడియాలోనూ భూకంపం.. భూ ప్రకంపనలు.. అనే అంశాలే కనిపించలేదు. అసలు ఉన్నట్టుండి భూకంపం ఎక్కడి నుంచి వచ్చింది..? అని ఆరా తీస్తే.. రాజధాని గ్రామాలకు అవతలి కర్లపూడి అనే గ్రామంలో మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల ఏర్పడిన కంపం అని తెలిసింది.
Also Read: కృష్ణదేవరాయలు మరణించింది ఎప్పుడో తెలుసా
కొంతమంది వైసీపీ నేతలు అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున జిలెటిన్ స్టిక్స్ తో పేలుళ్లు జరుపుతున్నారు. అధికారులు కూడా అధికార పార్టీకి చెందిన వారిని పట్టించుకోవడం లేదు. దీంతో వారు చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో మైనింగ్ కోసం చేశారో.. లేక అమరావతి భూకంపం అని ప్రచారం చేయడానికి చేశారో.. కానీ.. ఒక్కసారే పెద్ద ఎత్తున పేలుళ్లను జరిపించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి జగన్ మీడియాలో అమరావతిలో భూకంపం అనే ప్రచారం జోరుగా సాగింది. దీన్ని చూసిన అమరావతి చుట్టు పక్కల ప్రజలు ముక్కున వేలేసుకోవడం వారి వంతయ్యింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
తమ ప్రాంతంలో ఇంతపెద్ద కుట్ర జరుగుతుందా..? అని అమరావతి చుట్టు పక్కల ప్రజలు ఆశ్చర్య పోయారు. అయితే ఇలాంటి ఘటన జరిగితే తక్షణమే బాధ్యులను అరెస్టు చేయాలి. కానీ పోలీసులు అలాంటి చర్యలు తీసుకోలేదు. మొత్తానికి అమరావతి కట్టిస్తామని ప్రకటనలు చేసి.. ఏదో విధంగా పాజిటివ్ నెస్ తెచ్చుకుందామనుకున్న అధికార పార్టీ.. అమరావతిపై తప్పుడు ప్రచారం చేసే అవకాశాన్ని వదులుకోబోమని తెల్చేచి. ప్రజల్లో ఏర్పడిన పాజిటివ్ అనుమానాలను ఒక్కరోజులో పటాపంచలు చేసింది.