https://oktelugu.com/

ఏపీలో ఎమ్మెల్సీ కాల్ డేటా లీకేజీ.. నిందితుల కోసం ఆరా?

ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ల ట్యాప్ ల వ్యవహారం కలకలం రేపుతోంది. వైసీపీ తరఫున తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన కడప జిల్లా నేత రమేష్ యాదవ్ కాల్ డాటా లీకై సంచలనం కలిగిస్తోంది. ఆ తర్వాత ఆయన కాల్ డేటా లీక్ అయి ప్రైవేటు వ్యక్తులకు చేరింది. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. కడప జిల్లా నుంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన రమేష్ యాదవ్ కాల్ డేటా లీకేజీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 19, 2021 / 02:16 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ల ట్యాప్ ల వ్యవహారం కలకలం రేపుతోంది. వైసీపీ తరఫున తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన కడప జిల్లా నేత రమేష్ యాదవ్ కాల్ డాటా లీకై సంచలనం కలిగిస్తోంది. ఆ తర్వాత ఆయన కాల్ డేటా లీక్ అయి ప్రైవేటు వ్యక్తులకు చేరింది. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. కడప జిల్లా నుంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన రమేష్ యాదవ్ కాల్ డేటా లీకేజీ వ్యవహారం కలకలం రేపుతోంది.

    సీఎం జగన్ సొంత జిల్లా కావడం, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కాల్ డేటా ప్రైవేటు వ్యక్తులకు ఎలా చేరిందనే వ్యవహారంపై ఆరా తీశారు. చివరికి ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను సప్పెండ్ చేస్తూ కడప ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు.

    వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కాల్ డేటా లీకేజీ వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ తాజాగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయంపై ఆరా తీస్తున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కాల్ డేటాకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    దీంతో ఈ కేసులో నిజానిజాలు వెలికి తీసేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంలో ప్రభుత్వం విచారణ చేపడుతోంది. ఎమ్మెల్సీ కాల్ డేటానే తస్కరించిన కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ప్రజాప్రతినిధుల ఫోన్ కాల్ డేటాకే ప్రైవసీ లేకపోతే ఇక ప్రజల సంగతి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోతుగా ఆరా తీస్తే ఇంకా ఎన్నో నిజాలు బయటపడే అవకాశం ఉంది.