Site icon OkTelugu

పోలవరంలో ముగిసిన సీఎం జగన్ పర్యటన

పోలవరం ప్రాజక్టు సందర్శనలో భాగంగా సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. అధికారులతో కలిసి సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ను హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి సీఎం స్వయంగా పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. అనంతరం సీఎం జగన్ పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ ను సీఎం పరిశీంంచారు. పోలవరం పనుల ఫొటో గ్యాలరీని వీక్షించారు.

Exit mobile version