
హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ బీసీ సంక్షేమ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. దీంతో బీసీ సంక్షేమ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్పొరేషన్లకు, ఫెడరేషన్ లకు నిధులు విడుదల చేయాలని అలాగే బీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీసీలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న బుణాలు వెంటనే విడుదల చేయాలన్నారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో సంక్షేమ భవన్ ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఓబీసీ నేతలు నినాదాలు చేశారు.