
MLC Kavitha : ఢిల్లీకి రాజైనా సరే పోలీసులు, కేసులు చికాకులు అంటే ఎవరైనా తట్టుకోలేరు. అయితే ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెను ఈడీ వెంటాడుతోంది.. తరచూ నోటీసులతో ఆమెను వార్తల్లో ఉంచుతోంది.
ఇది అధికార బీఆర్ఎస్, కవితకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇప్పటికే ఓసారి విచారణకు హాజరైన కవిత నేడు కూడా విచారణకు వెళుతోంది. ఈరోజు ఆమెను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి. ఈక్రమంలోనే కవిత చాలా ఏమోషనల్ గానే ఈడీ కార్యాలయానికి వచ్చింది. అక్కడ ఆమె చేసిన పని వైరల్ అయ్యింది.
ఈడీ కార్యాలయం దగ్గర కవిత భావోద్వేగానికి గురైంది.. భర్త అనిల్‌ను హత్తుకొని కాసేపు కన్నీళ్లు తెచ్చుకున్నట్టు అర్థమవుతోంది. పోలీసులు, కేసుల పరంపరలో కొద్దిరోజులుగా మనసు మనసులో లేకుండా కవిత సైలెంట్ గా మనస్థాపంతో ఉంటోంది.
ఈడీ కార్యాలయం దగ్గర లోపలికి వెళ్లబోతుండగా మళ్లీ వస్తానో రానో.. అరెస్ట్ చేస్తారేమోనన్న ఆందోళన కవితలో కనిపించింది. అందుకే కవిత భావోద్వేగంతో భర్త అనిల్‌ను ఆలింగనం చేసుకుంది.
ఈడీ విచారణకు ఈ ఉదయం హాజరైన ఎమ్మెల్సీ కవిత విచారణకు సహకరించింది. లిక్కర్ స్కామ్ కేసులో రెండో సారి ఈడీ ముందుకు వచ్చింది. ఈరోజు కవిత, అరుణ్ పిళ్లై కలిపి ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలపై ఈడీ ఆరా తీయనుంది.
ఇండో స్పిరిట్ సంస్థలో వాటాలపై ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కవితతో కలిసి ఈడీ ఆఫీస్ ఎంట్రీ వరకూ వెళ్లిన ఆమె భర్త అనిల్ భార్యకు అండగా నిలిచాడు. ధైర్యం చెప్పి కవితను ఈడీ ఆఫీస్‌లోకి పంపిన ఆమె భర్త వెన్నంటే అక్కడే ఉన్నాడు. ఈ సాయంత్రం కవితను అరెస్ట్ చేస్తారా? లేదా? అన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది.