Tiktok Durga Rao: టిక్ టాక్ దుర్గారావు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరేమో. భిన్నమైన డాన్స్ వీడియోలతో అతడు ఫేమస్ అయ్యాడు. చైనా సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ చాలా మంది సామాన్యులను స్టార్స్ చేసింది. వారిలో టిక్ టాక్ దుర్గారావు ఒకరు. తన భార్యతో పాటు డాన్స్ వీడియోలు చేస్తూ ఆడియన్స్ దృష్టిలో పడ్డారు. దుర్గారావ్ డాన్స్ చేస్తుంటే పక్కనే మైక్ పట్టుకున్నట్లు తల ఊపుతూ సింగర్ మాదిరి ఆయన భార్య నటిస్తుంది. ఆమె బాడీ లాంగ్వేజ్ చాలా ఫన్నీగా ఉంటుంది.
పలాస 1978 మూవీలోని ‘నక్కిలీసు గొలుసు’ దుర్గారావుని ఓవర్ నైట్ స్టార్ చేసింది. ఆ పాటకు ఆయన వేసిన స్టెప్స్ వైరల్ అయ్యాయి. దుర్గారావు దంపతుల కారణం ‘నక్కిలీసు గొలుసు’ సాంగ్ వెలుగులోకి వచ్చింది. ఈ సాంగ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె దుర్గారావు దంపతులను పిలిచి సన్మానించారు. ఢీ షోలో దుర్గారావు మూమెంట్స్ కాఫీ చేస్తూ, కాన్సెప్ట్ తీసుకొని డాన్సర్ పండు ఒక సాంగ్ చేశాడు. ఇలా దుర్గారావ్ ఫేమ్ సోషల్ మీడియా నుండి బుల్లితెరకు పాకింది.
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో దుర్గారావ్ పాల్గొన్నారు. దుర్గారావ్ కి సినిమాల్లో కూడా అవకాశాలు రావడం విశేషం. క్రాక్ మూవీలో చిన్న పాత్రలో కనిపించి అలరించాడు. అలాంటి దుర్గారావ్ అసలు ఎవరు ? ఆయన వృత్తి ఏంటి? ఏం చదువుకున్నాడు? వంటి విషయాలు తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. దుర్గారావ్ గతంలో తన లైఫ్ గురించి చెప్పుకొచ్చారు. దుర్గారావ్ పెద్దగా చదువుకోలేదు. ఓ ఆసామి వద్ద పని చేస్తుంటాడు. ఆయన పొలాలు, వ్యవసాయ పనులు చూసుకుంటూ ఆయన వద్దే ఉంటాడు.
ఒకసారి దుర్గారావు బంధువుల అబ్బాయి టిక్ టాక్ వీడియోలు చేయడం చూశాడు. దాని గురించి అడిగి తెలుసుకున్నాడు. మన టాలెంట్ చూపిస్తే లైక్స్ వస్తాయి. ఫేమస్ కావచ్చని చెప్పాడు. అప్పటి నుండి దుర్గారావు టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. అనూహ్యంగా సక్సెస్ అయ్యాడు. టిక్ టాక్ బ్యాన్ అయ్యాక ఇంస్టాగ్రామ్ లో చేస్తున్నాడు. పెళ్లిళ్లు, తిరునాళ్లలలో టిక్ టాక్ దుర్గారావు దంపతులు షోలు ఇస్తున్నారు. ఏకంగా బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చిందంటూ ప్రచారం జరుగుతుంది.