Homeజాతీయ వార్తలుTeenmar Mallanna: జైల్లో తీన్మార్ మల్లన్న.. వాళ్లింట్లో ఎమ్మెల్యే సీతక్క కన్నీటిపర్యంతం

Teenmar Mallanna: జైల్లో తీన్మార్ మల్లన్న.. వాళ్లింట్లో ఎమ్మెల్యే సీతక్క కన్నీటిపర్యంతం

MLA SeethakkaTeenmar Mallanna: ప్రశ్నించే గొంతుకల్ని నొక్కేస్తున్నారు. గర్జించే సింహాలను బోనులో వేస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వారిని కటకటాల పాలు చేస్తున్నారు. యూట్యూబ్ చానల్ ద్వారా కేసీఆర్ అక్రమాలను బయటపెడుతుంటే పోలీసులతో అరెస్టు చేయించి కారాగారంలో వేయించింది ప్రభుత్వం. తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ కేసీఆర్ పై పోరాటం చేస్తున్న కారణంగా అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. జ్యోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ తనను తీన్మార్ మల్లన్న డబ్బులు డిమాండ్ చేశారనే అభియోగంపై అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేసి సికింద్రాబాద్ కోర్టు ఎదుట హాజరు పరిచారు. దీంతో మల్లన్నకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ప్రస్తుతం తీన్మార్ మల్లన్న చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

తీన్మార్ మల్లన్న అరెస్టు పై రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయ. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka) వెళ్లారు. మల్లన్న కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయారు. ఆయన కూతురు పరిస్థితిని చూసి ఆవేదనకు గురయ్యారు. కూర్చోలేని, నడవలేని విదంగా అచేతనలో పడి ఉన్న ఆయన కూతురు స్థితి చూసి భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్య కారణాలతో నడవలేకపోతున్న మల్లన్న కూతురున చూసి ఆవేదన చెందారు.

పోలీసులు మల్లన్నను అరెస్టు చేసిన తీరుపై కుటుంబసభ్యులు సీతక్కకు వివరించారు. కనీసం కలిసేందుకు కూడా అనుమతించడం లేదని చెబుతున్నారు. మల్లన్న తల్లి తన కొడుకు అరెస్టుపై కన్నీటి పర్యంతమైంది. ఇంట్లో ఇన్ని బాధలున్నా సమాజం కోసం మల్లన్న చేస్తున్న పోరాటంపై మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ చేస్తున్న నిర్వాకాల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇంకెంత కాలం మోసం చేస్తారో అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తీన్మార్ మల్లన్నను నిన్న జగద్దిరిగుట్ట పోలీసులు వర్చువల్ గా విచారించారు. తన ఫోన్ నెంబర్ ను మల్లన్న మీడియాలో స్రీన్ పై ప్రదర్శించారని సంపత్ అనే వ్యక్తి గతంలో చేసిన ఫిర్యాదు మేరకు మల్లన్నపై జగద్దిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇటీవల లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడు మల్లన్న తనను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడనే ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పీటీ వారంట్ పై తీన్మార్ మల్లన్న ను పోలీసులు వర్చువల్ గా విచారించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular