Homeఅంతర్జాతీయంJoe Biden, Ashraf Ghani: అమెరికా పోరు సై అన్న అప్ఘన్ల పిరికితనమే కొంప ముంచిందా?

Joe Biden, Ashraf Ghani: అమెరికా పోరు సై అన్న అప్ఘన్ల పిరికితనమే కొంప ముంచిందా?

Joe Biden, Ashraf GhaniJoe Biden, Ashraf Ghani: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అఫ్గనిస్తాన్ (Afghanistan) తాజా మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Ashraf Ghani) ఫోన్ సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. అఫ్గాన్ లో తాజా పరిణామాల నేపథ్యంలో వీరి సంభాషణ సంచలనం కలిగిస్తోంది. దేశ పరిస్థితుల నేపథ్యంలో పటిష్ట ప్రణాళిక తమ వద్ద ఉందని బహిరంగంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని బైడెన్ ఘనీకి షరతు విధించారు. మాజీ అధ్యక్షుడు కర్జాయ్ వంటి నేతలతో సఖ్యతగా వ్యవహరించాలని సూచించారు. దీంతో వీరి మధ్య సాగిన ఫోన్ సంభాషణ వెలుగులోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

బైడెన్, ఘనీ జులై 23న చివరిసారిగా దాదాపు 14 నిమిషాల పాటు చర్చించుకున్నారు. సైనిక, రాజకీయ వ్యూహాలపై ఇరువురు మాట్లాడుకున్నారు. పరిస్థితులను నియంత్రించేందుకు మేం సహాయం చేస్తామని బైడెన్ హామీ ఇచ్చారు. సైనిక వ్యూహాల అమలులో అఫ్గానీల సాయం తీసుకోవాలన సూచించారు. రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్ వంటి వారికి తగిన బాధ్యతలు అప్పగించాలని బైడెన్ చెప్పారు. మూడు లక్షల మంది సైన్యం మీవద్ద ఉండగా తాలిబన్ల సంఖ్య కేవలం 70 వేలు అని ఘనీకి ధైర్యం నింపారు.

మీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాం. భవిష్యత్తులో మీ సర్కారు బలపడేందుకు మద్దతు ఇస్తామని బైడెన్ సలహా ఇచ్చారు. పాకిస్తాన్ ప్రోద్బలంతోనే అఫ్గాన్ ను తాలిబన్లు ఆక్రమిస్తున్నారని బైడెన్ పేర్కొన్నారు. తాలిబన్లకు పాక్ అన్ని విదాలా సహకరిస్తుందని అన్నారు. 10-15 వేల మంది అంతర్జాతీయ ఉగ్రవాదులు తాలిబన్లతో కలిసి విధ్వంసం సృష్టిస్తున్నారని గుర్తు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులన తమ దేశంలోకి పంపిందని ఘనీ ఆరోపించారు.

ప్రస్తుతం ఉన్న తక్కువ సమయంలో అందరిని కలుపుకుని పోవడం సాధ్యం కాదన్నారు. వీరి సంభాషణ సాగే నాటికే తాలిబన్లు అఫ్గాన్ ను ఆక్రమించారు. గత 14 కల్లా వారు కాబుల్ శివారులోకి చేరుకున్నారు .దీంతో ఘనీ దేశం విడిచి పారిపోయారు. తదనంతర పరిణామాలు మనందరికి తెలిసినవే. తాలిబన్లు మొత్తం దేశాన్ని తమ గుప్పిట్లోకీ తీసుకున్నారు. వారి అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular