Siddharth Shukla: బాలీవుడ్ యువ నటుడు, హిందీ బిగ్ బాస్ సీజన్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా ( Siddharth Shukla) కన్నుమూశారు. ఆయన కన్నుమూయడం హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరని లోటు. ఈ రోజు ఉదయం సిద్ధార్థ్ శుక్లాకు ఉన్నట్టు ఉండి ఆకస్మిక గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు. అయితే, ఆయన మార్గమధ్యంలోనే ఈ రోజు ఉదయం ప్రాణాలు విడిచారు.
శుక్లా మరణాన్ని ముంబైలోని కూపర్ ఆసుపత్రి ధృవీకరించింది. సిద్ధార్థ్ కి ప్రస్తుతం 40 ఏళ్ళు. కేవలం 40 ఏళ్ళకే ఇలా గుండెపోటుతో ఆయన మృతి చెందడం బాధాకరమైన విషయం. ఇక సిద్ధార్థ్ శరీరభాగాలను అవయవ దానం చేస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. సిద్ధార్థ్ శుక్లా మరణవార్త విని హిందీ చిత్రసీమ తీవ్ర శోకసంద్రంలో మునిగి పోయింది.
హిందీ సినీ ప్రముఖులు సిద్ధార్థ్ శుక్లా మరణం పట్ల స్పందిస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. వాళ్ళు సిద్ధార్థ్ శుక్లా లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్తులో మంచి నటుడు కావాల్సిన సిద్ధార్థ్ శుక్లా, ఈ లోపే ఇలా చనిపోవడం బాధాకరం. సిద్ధార్థ్ శుక్లా సినీ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున సిద్ధార్థ్ శుక్లా మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము