MLA Roja: నగరి ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జి రోజా ఏం చేసినా సంచలనమే. తనదైన శైలిలో వార్తల్లో నిలవడం ఆమెకు అలవాటే. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలను ఏరిపారేసినా, ఫైర్ బ్రాండ్ గా ఆమె ప్రత్యేకత వేరు. తన పదునైన పదజాలంతో ఎదుటివారిని అదరగొట్టే ఆమె పలుమార్లు వార్తల్లో నిలుస్తున్నారు. కళాకారులతో కలిసి డప్పు కొట్టినా.. కబడ్డీ కోర్టులో కూత పెట్టినా రోజాకు ఎవరు సాటిరారు. పరిపాలనలో కూడా తన దైన ముద్ర వేస్తూ ప్రజలతో మమేకమై పోవడం మామూలు విషయం కాదు.
నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబరకుప్పం ఎస్వీ కోయిల్ వీధిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సదుపాయాలతో పవర్ లూమింగ్ మిషన్ల యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మగ్గంపై కూర్చుని చీర నేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రాలతో కూడాన చిత్రాలతో చీర నేసి తన స్వామిభక్తి నిరూపించుకున్నారు. అనంతరం చీరను ప్రదర్శించారు. వస్ర్త రంగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని నేతన్నలు ఎదగాలని ఆశిస్తున్నారు.
వారిలో ఆత్మస్థైర్యం నింపడం కోసమే రోజా పరితపిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని నేతన్నలు తమదైన రంగంలో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. వస్రాల్లో నూతన పద్ధతులు పాటించి నేతన్నలు ముందుకు కదలాలని సూచిస్తున్నారు. జెకార్డ్ మిషన్లతో పవర్ లూమ్స్ తో నేత నేయడం అందరికి సముచితమే అని చెబుతున్నారు.
టెక్నాలజీ మన రాష్ర్టంలో మన జిల్లాలోని నగరిలోనే ఈ విధమైన మిషన్లను స్థాపించి నేతన్నలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. వస్ర్త ప్రపంచంలో పెను మార్పులు సృష్టించడమే ధ్యేయమని చెప్పారు. దీనికి రోజా తనవంతు బాధ్యత నిర్వహిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం అత్యాధునిక సదుపాయాలతో అందరిని మంచి స్థానంలో నిలుపుతామని చెబుతున్నారు.