Vikramarkudu-2: ‘విక్కమార్కుడు-2’ కథ రెడీ.. హీరో, డైరెక్టర్ ఎవరు?

Vikramarkudu-2: టాలీవుడ్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి ఎదిగాడు రాజమౌళి (Rajamouli). ఆయన ఎదుగుదలలో ప్రతీ చిత్రం కూడా విజయవంతమైంది. ‘స్టూడెంట్ నంబర్ 1’ నుంచి మొదలుకొని.. నేటి ‘బాహుబలి’ వరకు ప్యాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగే వరకూ రాజమౌళి ప్రస్థానం సాగింది. రాజమౌళి సినిమాలు అనగానే అందులో కామెడీకి తక్కువ ప్రాధాన్యం ఉంటుందన్న విమర్శ ఉంది. ఎక్కువగా ఎమోషనల్, సీరియస్ యాక్షన్ ఉంటుందన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. కానీ రాజమౌళి సైతం కామెడీ చేయించగలడు.. […]

Written By: NARESH, Updated On : September 18, 2021 9:45 am
Follow us on

Vikramarkudu-2: టాలీవుడ్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి ఎదిగాడు రాజమౌళి (Rajamouli). ఆయన ఎదుగుదలలో ప్రతీ చిత్రం కూడా విజయవంతమైంది. ‘స్టూడెంట్ నంబర్ 1’ నుంచి మొదలుకొని.. నేటి ‘బాహుబలి’ వరకు ప్యాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగే వరకూ రాజమౌళి ప్రస్థానం సాగింది.

రాజమౌళి సినిమాలు అనగానే అందులో కామెడీకి తక్కువ ప్రాధాన్యం ఉంటుందన్న విమర్శ ఉంది. ఎక్కువగా ఎమోషనల్, సీరియస్ యాక్షన్ ఉంటుందన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. కానీ రాజమౌళి సైతం కామెడీ చేయించగలడు.. నవ్వించగలడని ఓ చిత్రం నిరూపించింది. అదే ‘విక్రమార్కుడు’.

ఎమోషన్ కు ఎమోషన్.. కామెడీకి కామెడీ దట్టించి నింపిన మూవీ ‘విక్రమార్కుడు’. ఇందులో రవితేజ-బ్రహ్మానందం ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. ఇప్పటికీ ఈ సీన్లు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. అంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీకి ఇప్పుడు సీక్వెల్ ను రెడీ చేశాడట దిగ్గజ రచయిత విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad). దాదాపు విక్రమార్కుడు2 కథను ప్యాన్ ఇండియా స్థాయిలో రెడీ చేశాడట..

అయితే విక్రమార్కుడు తీసిన రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమా చేసే అవకాశాలు ఎంతమాత్రం లేవు. ఎందుకంటే.. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కంప్లీట్ చేసి మహేష్ బాబుతో యాక్షన్ అడ్వంచర్ ప్లాన్ చేశాడు. అదో రెండు మూడేళ్లు పడుతుంది. దీనికంటే ముందు మైత్రీ మూవీస్ తో బాలీవుడ్ సినిమా కూడా ప్లాన్ చేశాడు. దీంతో రాజమౌళి డేట్స్ ఖాళీ లేవు.

అందుకే విక్రమార్కుడును హిందీలో రిమేక్ చేసిన అక్షయ్ కుమార్ తో కలిసి ‘విక్రమార్కుడు2’ తీయాలని విజయేంద్రప్రసాద్ యోచిస్తున్నారట.. ఏదైనా దర్శకుడికి ఈ కథను ఇవ్వాలని అనుకుంటున్నాడట.. అంటే తండ్రి విజయేంద్రప్రసాద్ కథను ఈసారి రాజమౌళి డైరెక్ట్ చేయడం లేదన్న మాట..