Railway Recruitment 2021: రైల్వేలో 3093 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Railway Recruitment 2021: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నిరుద్యోగ యువతకు తీపికబురు చెప్పింది. నార్తర్న్ రైల్వే సంస్థల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. 3093 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. http://rrcnr.org/ అధికారిక వెబ్ సైట్ ద్వారా […]

Written By: Kusuma Aggunna, Updated On : September 18, 2021 9:58 am
Follow us on

Railway Recruitment 2021: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నిరుద్యోగ యువతకు తీపికబురు చెప్పింది. నార్తర్న్ రైల్వే సంస్థల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. 3093 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

http://rrcnr.org/ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తులు ప్రారంభమైన తర్వాత ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన కాలపరిమితి, ఎంపిక విధానం, జీత భత్యాలకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి. పదో తరగతి లేదా ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పది, ఇంటర్ అర్హతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ట్రేడ్‌లలో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుస్తుకునే అవకాశం ఉంటుంది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయి.