
తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24గంటల్లో 316 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,730కి చేరింది. తాజాగా వైరస్ నుంచి 612 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 2,73,625 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్ ప్రభావంతో మరో ఇద్దరు మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1515కు చేరింది. కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 0.53శాతంగా ఉందని, రికవరీ రేటు 97.12శాతంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6590 యాక్టివ్ కేసులున్నాయని, మరో 4467 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని వివరించింది.