MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణ ఎన్నికలను తలపించేలా గొడవలకు వేదికవుతున్నాయి. ఇన్నాళ్లు నిశ్శబ్దంగా సాగిన ఎన్నికలు ఈ సారి మాత్రం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించుకోవాల్సి ఉన్నా కొందరి కారణంగా రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లడం బాధాకరం. రెండు వర్గాల్లో పరస్పరం దూషణల పర్వం ఏర్పడింది. తామంటే తామని విరుద్ధంగా మాట్లాడటం చూస్తుంటే సభ్యుల్లో ఆందోళన నెలకొంది.

మా ఎన్నికలు(MAA Elections) సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని చెబుతున్నారు. మాలో ఇంతలా రాజకీయాలు పెరిగిపోవడం పట్ల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం సామరస్యంగా మాట్లాడుకోవచ్చు. కానీ ఇలా రాజకీయాలు చేస్తూ వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏ ప్యానల్ గెలిచినా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవరసం గుర్తించాలి. పరస్పర సహకారంతో ఐకమత్యంగా నడవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజా మా వ్యవహారాలపై పెదవి విప్పారు. సాధారణ ఎన్నికలను తలపిస్తున్న రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఎవరు గెలిచినా తన సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పారు. గెలిచిన వారిని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి మా సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ తీసుకుంటానని పేర్కొన్నారు. మాలో ఎంత పోటీ ఉన్నా అందరు తమకు కావాల్సిన వారే అని చెప్పారు. మా ఎన్నికల్లో ఇంతలా పోటీ వాతావరణం తాను ఎప్పుడు చూడలేదని అన్నారు.