
SS Rajamouli: తెలుగు సినిమాలో స్టూడెంట్ నంబర్ వన్ తో మొదలైన ప్రస్తానం.. ప్రస్తుతం అతడిని బాహుబలిని చేసింది. చిన్నప్పటి నుంచి ఉన్న పుస్తకాల పిచ్చిని పెద్ద డైరెక్టరుగా మార్చింది. పుస్తకాల పురుగు.. గొప్ప కథానాయకుడిగా ఎదిగారు. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా తీసిన ప్రతీసినిమా హిట్ కొట్టడంతో కింగ్ ఆఫ్ సినిమాగా పేరు పొందారు.. ఎస్ఎస్ రాజమౌళి.. మనందరం ముద్దుగా పిలుచుకునే జక్కన్న. టాలీవుడ్ ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్లో పరిచయం చేసిన రాజమౌళి పుట్టిన రోజు ఆరోజు.. ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానం గురించి ఒక్కసారి..
కర్నాటకా రాయచూర్ కు చెందిన రాజమౌళి(SS Rajamouli) అక్కడే తన బాల్యాన్ని గడిపారు. వారి ఊరిలో ఉన్న లైబ్రరీలో చాలా కథల పుస్తకాలు ఉండేవి. నిత్యం అక్కడికి వెళ్లే జక్కన్న ప్రతీ పుస్తకాన్ని చదివేవాడు. ఎక్కువగా కథల పుస్తకాలు చదివేవాడు. లైబ్రరీతో పాటు ఇంట్లో వాళ్ల నాన్నమ్మ చెప్పే కథలనూ కూడా నిత్యం వింటుండేవాడు. విన్న కథలను తన కోణంలో ఆలోచన చేసేవాడు. దాన్ని మరింత కొత్తకోణంలో ఆలోచన చేసి.. కథనే మార్చిన ఘనుడు రాజమౌళి.. విన్న కథను.. తాను ఆలోచన చేసిన కథను అలాగే వదిలివేయకుండా.. బడికి వెళ్లిన ఉపాధ్యాయులకు చెప్పేవాడు. వారు అతడి కథను విని చాలా అభినందించేవారు. తరువాత కథల సంఖ్య పెరిగిపోవడంతో కథల రాయుడు వచ్చాడురోయ్ అంటూ.. సంబోధించేవారు.
ఇంటర్ చదువున్న రోజుల్లో సినిమాలపై ఉన్న ఆసక్తితో చెన్నైకి చేరుకున్నాడు. అక్కడ కీరవాణి వదిన ప్రోత్సాహంతో ఎడిటింగ్ అసిస్టెంటుగా చేరిపోయాడు. అదే క్రమంలో తాను ఎడిటింగ్ చేసే సినిమాల్లో కంటెంట్ కరెక్టుగా లేదని చెప్పుకొచ్చేవాడు. తానైతే ఇలా చేస్తానని చెప్పేవాడు. ఇదే క్రమంలో దర్శకత్వంపై దృష్టి పెట్టాడు. రాఘవేంద్రరావు దగ్గర పనిచేస్తున్న క్రమంలో అప్పటి అధికార పార్టీకి ప్రకటనలు చేసేవాడు. 2002లో సినిమాల్లో అవకాశం దక్కింది. స్కూడెంట్ నంబర్ వన్ కు డైరెక్షన్ చేసే చాన్స్ కొట్టేశాడు. సినిమా సూపర్ హిట్ తిరిగిచూడని జక్కన్న మగధీర, ఈగ, బాహుబలి వంటి చిత్రాలు తీసి రికార్డులు సృష్టించాడు. మరో సంచలనం ఆర్ఆర్ఆర్ ను ఇప్పటికే పూర్తి చేయగా.. సంక్రాంతికి విడుదల కానుంది.