Homeజాతీయ వార్తలు$exually Harassments: భుజాల మీద చేయి వేస్తాడు.. తాకేందుకు ప్రయత్నిస్తాడు: ఎమ్మెల్యే కాదు కామపిశాచి

$exually Harassments: భుజాల మీద చేయి వేస్తాడు.. తాకేందుకు ప్రయత్నిస్తాడు: ఎమ్మెల్యే కాదు కామపిశాచి

MLA Rajaiah harassing women sarpanch
MLA Rajaiah harassing women sarpanch

$exually Harassments: ” నన్ను చూసే టికెట్ ఇచ్చాను అన్నాడు.. ఒంటరిగా వస్తేనే ఏ పనైనా చేస్తానన్నాడు. మహిళల భుజాల మీద చేతులు వేస్తాడు. ఎక్కడెక్కడో తాకేందుకు ప్రయత్నిస్తాడు. చెప్పలేక ఇబ్బంది పడుతున్న వారేందరో.. నేను మీడియా ముందుకు వచ్చాను.. నాపై బెదిరింపులు మొదలయ్యాయి” అని అంటున్నది జానకిపురం సర్పంచ్ నవ్య. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగిక వేధింపులపై  పలు కీలక విషయాలు వెల్లడించింది.

” మా ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య నన్ను లైంగికంగా వేధించాడు. మీరు తండ్రి లాంటివారు. నేను కూతురు లాంటి దానినని వేడుకున్నప్పటికీ వేధింపులు మానలేదు” అని నవ్య వాపోతోంది. “సర్పంచ్ టికెట్ నీ భర్తను చూసి కాదు, నిన్ను చూసి ఇచ్చాను. నీ మీద కోరికతో, ఆశతో మాత్రమే ఇచ్చాను. నాకు సహకరించకపోతే గ్రామ అభివృద్ధికి ఏమాత్రం సహకరించను. గ్రామ ప్రజలు నిన్ను వ్యతిరేకించే విధంగా చేస్తా” అని ఎమ్మెల్యే బెదిరించేవాడని నవ్య వాపోయింది. ఆయన మాటలను నిరాకరించినందుకుగాను గ్రామ అభివృద్ధికి సహకరించకపోగా, గ్రామంలో గ్రూపులు ఏర్పాటు చేసి తనకు విలువ లేకుండా చేశారని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది.

MLA Rajaiah harassing women sarpanch
MLA Rajaiah harassing women sarpanch
” ఎమ్మెల్యే రాజయ్య మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. మహిళలను తాకకుండా మాట్లాడలేడు. భుజాల మీద చేతులు వేస్తాడు. కౌగిలించుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఎక్కడెక్కడో తాకాలని చూస్తాడు. ఎంతోమంది మహిళలు మానసికంగా ఇబ్బంది పడుతూ బయటకు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి వన్నీ భరించేందుకు నేను సిద్ధంగా లేకపోవడంతో ఇబ్బందులు సృష్టించడం మొదలుపెట్టాడు. మహిళల పట్ల ఆయన ఎలా ఉంటాడో? నియోజకవర్గంలో అందరికీ తెలిసిందే. కొంత మంది మహిళలు మౌనంగా భరిస్తున్నారు. అవకాశం వస్తే వారు కూడా మీడియా ముందుకు వస్తారు. నేను మాట్లాడే ప్రతి విషయానికి నా దగ్గర ఆధారం ఉంది. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ఎమ్మెల్యే బండారం బయట పెడతాను. ఏ వర్గాల కోసం నేను ఈ ఆరోపణలు చేయట్లేదు.. ఎన్నో రోజుల ఆవేదన ఇది. నాలాగా మరెవరూ బాధపడకూడదు. ఆ ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను” అని నవ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది..
మరో వైపు నవ్య ఆరోపణల నేపథ్యంలో రాజయ్య పై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని బీఆర్ఎస్ మహిళా నాయకులు అంటున్నారు. రాజయ్యకు ఐదోసారి పార్టీ టికెట్ వస్తుందన్న విషయం జీర్ణించుకోలేక ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా నవ్య ఆరోపణపై స్పందించారు. తనపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని, ఎన్నికలు దగ్గర పడుతుండడంతో గతంలో మాదిరిగా తనను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పికొడతానని, జరిగిన విషయాలు మొత్తం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని అంటున్నారు. మరో వైపు రాజయ్యను బర్తరఫ్ చేయాలని ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ కు ఫిర్యాదు చేశారు.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version