Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు, సినీనటుడు బాలకృష్ణ హల్ చల్ చేశారు. నియోజకవర్గంలో పర్యటించి అధికారులను హడలెత్తించారు. రెండు రోజులుగా నియోజకవర్గంలో కలియ తిరుగుతూ అందరిని కలుస్తున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్నిప్రాంతాలు కలియ తిరుగుతూ అందరిని పలకరించారు. నియోజకవర్గ పరిస్థితిపై ఆరా తీశారు.

ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులను సమీక్షించారు. వైద్యుల పనితీరును పర్యవేక్షించారు. రోగులను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఆస్పత్రిలో కల్పిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. సేవలు సరిగా అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. వైద్యులు సమయానికి వస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆస్పత్రిలో సందడి నెలకొంది.
బాలకృష్ణ ఆస్పత్రికి వస్తున్నారని తెలుసుకున్న సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆయన వస్తున్నందున ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు ప్రయత్నాలు చేశారు. రోగుల కోసం ప్రత్యేకించి సేవలు అందించారు.దీంతో ఎమ్మెల్యే పర్యటనపై ముందే సమాచారం అందుకోవడంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమయ్యారు.
Also Read: TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. వృద్ధులు, వికలాంగులకు అరగంటలోనే దర్శనం!
దీంతో ఆకస్మిక పర్యటన అయినా విషయం తెలియడంతో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునేందుకు ప్రయత్నించినా వైద్యుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగుల పట్ల సరైన విధంగా సేవలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ పర్యటన సంచలనం సృష్టించింది.
Also Read: Women: భూతవైద్యం మాయ.. ఆ మహిళను, ఆ మాంత్రికుడిని ఏం చేసిందంటే?