KCR: అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయడంలో సీఎం కేసీఆర్ ది అందెవేసిన చేయి. ఏ పని గురించి ఆలోచించినా అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. దాని మీదే ధ్యాస పెడతారు. అందుకే కేసీఆర్ ను మోనార్క్ గా అభివర్ణిస్తారు. ఈ నేపథ్యంలోనే సాగునీటి ప్రాజెక్టులు కానీ, ఉచిత విద్యుత్ అయినా తన కలల ప్రాజెక్టులుగా తీర్చిదిద్దుకున్నారు. దీంతో ఆయన అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పలు విధాలుగా పనులు చేసేందుకు ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సుందరీకరించే పనిలో నిమగ్నమయ్యారు.

దేవస్థానాన్ని వెయ్యి కోట్లతో అందంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా అధికారులను సమాయత్తం చేస్తున్నారు. స్వయంగా కేసీఆరే రంగంలోకి దిగి పనులు చక్కబెడుతున్నారు. ఆలయ జోర్ణోద్దారణ పనులు ముగింపు దశకు వచ్చిన సందర్భంలో సీఎం స్వయంగా పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. చినజీయర్ స్వామీ ఆధ్వర్యంలో పనులు చకచక సాగుతున్నాయి. మంగళవారం ఆలయాన్ని సందర్శించనున్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆలయ దశ మారింది. ఆలయ పునరుద్ధరణ కోసం రూ.1800 కోట్లు కేటాయించారు. ఇప్పటికే వెయ్యి కోట్ల పనులు పూర్తయ్యాయి. దీంతో ఆలయ వైభవం పెరగనుంది. యాదాద్రిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మార్పునకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
Also Read: TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. వృద్ధులు, వికలాంగులకు అరగంటలోనే దర్శనం!
ఈమేరకు మంగళవారం ఉదయం 11:30 గంటలకు కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో యాదాద్రి చేరుకుని పనులు పర్యవేక్షించనున్నారు. అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఆలయ పనుల ప్రగతిపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పనుల పురోగతి వేగం పుంజుకోనుందని సమాచారం. దీని కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Women: భూతవైద్యం మాయ.. ఆ మహిళను, ఆ మాంత్రికుడిని ఏం చేసిందంటే?