Vijayawada News: విజయవాడలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ బాలికపై ఓ ముసలివాడు కన్నేశాడు. నిత్యం వేధించాడు. కోరిక తీర్చాలని వెంటపడ్డాడు. ఏం చేయాలో తెలియని ప్రాయంలో బాలిక నానా ఇబ్బందులు పడింది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమయింది. చివరకు తన ప్రాణాలే తీసుకుంది. పసిప్రాయం తెలియని తనం వెరసి తన తనువు చాలించింది. అతడి నుంచి తప్పించుకునేందుకు రక్షించుకునేందుకు తనకు వేరే మార్గం కనిపించలేదు. తాత వయసులో అతడి చేష్టలకు తాళలేకపోయింది. నగరం నడిబొడ్డున ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా అతడు రాజకీయ పార్టీ నాయకుడు కావడంతో దుమారం రేగుతోంది.
విజయవాడలోని భవానీపురంలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే ఓ యాభైఏళ్ల వయసు గల ఓ వినోద్ జైన్ అనే నీచుడు అదే ప్రాంతంలో ఉండే ఓ పద్నాలుగేళ్ల బాలికపై కన్నేశాడు. తన కోరిక తీర్చమని నిత్యం వేధిస్తున్నాడు. ఎక్కడ కనిపించినా సూటిపోటి మాటలతో వేధిస్తున్నాడు. గత కొంత కాలంగా సాగుతున్నఈ బాగోతంపై బాలిక ఎవరికి చెప్పుకోలేక తనలోనే తానే కుమిలిపోయింది. చివరకు తను ప్రాణాలతో ఉండటం వద్దని భావించుకుని సూసైడ్ నోటు రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది. దీంతో పెద్ద సంచలనం అయింది.
Also Read: Union Budget Of India 2022: పాతికేళ్ల విజన్‌తో కేంద్ర బడ్జెట్.. ఉపాధి కల్పనకు అగ్ర తాంబూలం
ఇప్పటికే వివిధ పార్టీల్లో పనిచేసిన వినోద్ జైన్ కు రాజకీయ ప్రాబల్యం ఉందనే సాకుతో అతడిపై చర్యలకు ముందుకు రావడం లేదనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. మొత్తానికి టీడీపీ, జనసేన పార్టీలు నిందితుడిపై చర్యలు తీసుకోకపోతే వైసీపీదే తప్పు అవుతుందని చెబుతున్నాయి. దీంతో ప్రస్తుతం వైసీపీ ఇరకాటంలో పడుతోంది. కనీసం వయసు లేని బాలికను చిదిమాలని చూసిన వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా పని చేయడం లేదు. పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దారుణం. ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. బాలిక మరణానికి ఎవరు బాధ్యులనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దిశ చట్టం తెచ్చామని చెబుతున్నా ఏం చేసింది? చివరకు ఓ నిండు ప్రాణం పోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రుల శోకం తీరనిది. బాలిక మరణం క్షమించరానిది. దీనిపై ఏం చెబుతుంది ప్రభుత్వం. ఏం చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్.
Also Read: Union Budget Of India 2022: వేతన జీవులపై అదే ‘పన్ను’ బాదుడు.. బడ్జెట్ పేరు గొప్ప.. ఊరు దిబ్బ?