Chinna Mallareddy News: ఆస్తి విషయంలో అన్నదమ్ములు కొట్టుకోవడం చూశాం. చంపుకోవడం సహజమే. కానీ అక్కాచెల్లెళ్లు ఆస్తి కోసం తగవులాడుకోవడం ఇదే ప్రథమం. మానవ సంబంధాలు కాస్త ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఒకప్పటి ఆప్యాయతలు, అనురాగాలు కానరావడం లేదు. ప్రతీకారం, పగలే కనిపిస్తున్నాయి. తండ్రి ఆస్తి కోసం ఇద్దరు అక్కాచెల్లెళ్లు తనువులు చాలించడం సంచలన కలిగించింది. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్తి కావాలనే ఉద్దేశంతో ఇద్దరి మధ్య జరిగిన గొడవ చివరకు వారి ప్రాణాల మీదకే వచ్చింది.
కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డికి చెందిన ధర్మగౌని రాజాగౌడ్ కు నలుగురు కుమార్తెలు. అందరికి పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వారు చేసుకుంటున్నారు. దీంతో తండ్రికి ఉన్న ఐదెకరాల భూమిపై కొన్నాళ్లుగా గొడవ రగులుతోంది. నాకంటే నాకని అందరు లొల్లి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి ఆస్తి నలుగురికి చెందాలి. కానీ ఇద్దరి మధ్యే నిత్యం కొట్లాట జరుగుతూనే ఉంది. దీంతో సోమవారం సాయంత్రం వడియారంలో ఉండే నివాసం ఉండే రాజేశ్వరి ఇంటికి వరలక్ష్మి వచ్చింది.
Also Read: Union Budget Of India 2022: బడ్జెట్ 2022: కరోనా వేళ ఊరటదక్కేనా? ఐటీ పరిమితి పెరిగేనా? ఊసురుమంటారా?
కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. ఎంతకు పంచాయితీ తెగకపోవడంతో వరలక్ష్మి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను అక్క మీద పోసి నిప్పంటించింది. దీంతో మంటల్లో కాలిపోతున్న అక్క తన చెల్లెలును కూడా గట్టిగా కౌగించుకుంది. ఇద్దరు మంటల్లో చిక్కుకోవడంతో పిల్లలు అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. దీంతో వారిద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తండ్రి భూమి విషయంలో ఇంత రాద్దాంతం చేయడం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.
ఆస్తి కోసం సొంత అక్కపైనే పెట్రోల్ పోసిన వరలక్ష్మిపై పలువురు శాపనార్థాలు పెట్టారు. తుచ్చమైన ఆస్తి కోసం అక్కనే చంపాలని చూసిన వరలక్ష్మి తీరుపై విమర్శలు వస్తున్నాయి. తండ్రి ఆస్తి అందరికి సమానంగా పంచాలి. అంతేకాని ఇద్దరికి ఎలా దక్కుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్కపై పెట్రోల్ పోసిన చెల్లెలు రాజేశ్వరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మానవ సంబంధాల మనుగడ ప్రశ్నార్థకంలో పడింది. మానవ సంబంధాలు ఆర్థిక బంధాలుగానే మారిపోతున్నాయనడానికి ఇదే ప్రత్యక్ష తార్కాణం.
Also Read: Union Budget Of India 2022: వేతన జీవులకు ఊరట? నేటి బడ్జెట్లో కీలక పాయింట్ ఇదే!