https://oktelugu.com/

కేంద్ర మంత్రులకు రాష్ట్రాలతో సయోధ్య బాధ్యత!

కరోనా మహమ్మారి విస్తరించకుండా కట్టడి చేయడం కోసం వరుసగా తీవ్రమైన చర్యలు తీసుకొంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా వ్యవహరించే విధంగా చూడడంకోసం జాగ్రత్త పడుతున్నారు. అందుకనే తరచూ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులు, డిజిపిలతో కేంద్ర ప్రభుత్వం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవంక రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్యమంత్రి డా. హర్ష వర్ధన్ తరచూ మాట్లాడుతున్నారు. ప్రధాని స్వయంగా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 27, 2020 / 04:30 PM IST
    Follow us on

    కరోనా మహమ్మారి విస్తరించకుండా కట్టడి చేయడం కోసం వరుసగా తీవ్రమైన చర్యలు తీసుకొంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా వ్యవహరించే విధంగా చూడడంకోసం జాగ్రత్త పడుతున్నారు. అందుకనే తరచూ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులు, డిజిపిలతో కేంద్ర ప్రభుత్వం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

    మరోవంక రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్యమంత్రి డా. హర్ష వర్ధన్ తరచూ మాట్లాడుతున్నారు. ప్రధాని స్వయంగా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పుడు మంత్రులకు ఒకొక్క రాష్ట్రంలో నిత్యం జరుగుతున్న పరిస్థితులపై, అమలవుతున్న చర్యలపై పర్యవేక్షించే బాధ్యతలను అప్పజెప్పారు.

    కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు రాష్ట్రాలలో అమలయ్యే టట్లు చూడడం మంత్రుల విధి అని ప్రధాన మంత్రి తన మంత్రివర్గ సహచరులకు స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. ప్రతి రాష్ట్రానికి ఒక్కరిద్దరు మంత్రులను కేంద్రప్రభుత్వం ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఈ వారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    సామాజిక దూరం పాటిస్తున్న విధానం, కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు, మాస్క్‌లు, శానిటైజర్ల కొరత తదితర అంశాలపైపర్యవేక్షణ చేసే బాధ్యతలను వీరికి అప్పజెప్పారు. ఇందులో భాగంగా చిన్న రాష్ట్రాలకు ఒక మంత్రిని, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు, పెద్ద రాష్ట్రాలకు ఇద్దరు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.

    వీరు ప్రతిరోజు నమోదవుతున్న కరోనా కేసులు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, సామాజిక దూరం, కార్వంటైన్‌లో ఉన్న వారికి కల్పిస్తున్న సదుపాయాలు, అవసరం ఉన్న వారికి అందుబాటులో ఉన్న కమ్యూనిటీ కిచెన్‌లు, ఇతర పరిస్థితులు అన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ప్రధాని కార్యాలయానికి ఎప్పటికప్పుడు పంపించవలసి ఉంటుంది. జిల్లా మేజిస్ట్రేట్‌లు, జిల్లా కలెక్టర్‌లను అడిగి ప్రాథమిక స్థాయిలో సమాచారాన్ని తీసుకొని నివేదించమని మంత్రులకు సూచించారు.