Homeఆంధ్రప్రదేశ్‌Minister Roja: మాజీ మంత్రి బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా భావోద్వేగ ట్విట్.. వైరల్

Minister Roja: మాజీ మంత్రి బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా భావోద్వేగ ట్విట్.. వైరల్

Minister Roja: మంత్రి రోజా భావోద్వేగానికి గురయ్యారు. తనను టార్గెట్ చేస్తూ టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రోజా స్పందించారు. భావోద్వేగ ప్రకటనను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మంత్రి రోజా దూకుడుగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని డాన్సులు చేశారు. దీనిని టిడిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి.

చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల క్రమంలో రోజా వ్యవహరించిన తీరుపై టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు నాయకులు వచ్చే ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని.. మూడు నెలల వ్యవధిలోనే అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకు రోజాకు పంపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.అయినా సరే రోజా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణ లను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ వివాదంలో మంత్రి రోజా తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యర్థిగా మారారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి రోజాపై వ్యక్తిగత కామెంట్స్ చేశారు.

నందమూరి, నారా కుటుంబ సభ్యులపై నువ్వా విమర్శించేది అంటూ బండారు సత్యనారాయణమూర్తి విరుచుకుపడ్డారు. నీ గత జీవితం ఇది అంటూ వ్యక్తిగత విమర్శలు చేశారు. నువ్వు నటించిన వీడియోలు తమ వద్ద ఉన్నాయంటూ హెచ్చరికలకు దిగారు. దగ్గరే ఉండి ప్రోత్సహిస్తున్నారని సీఎం జగన్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో రాష్ట్ర మహిళా కమిషన్ కలుగజేసుకొని బిజెపికి లేఖ రాయడంతో… పోలీసులు బండారు సత్యనారాయణమూర్తి పై కేసులు నమోదు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి రోజాకు అండగా వైసీపీ నేతలు నిలవలేకపోయారని విమర్శలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో మంత్రి రోజా భావోద్వేగ ట్విట్ చేశారు. ” స్త్రీ ద్వేషులకు వ్యతిరేకంగా నేను కష్టపడి పని చేశా. ఒకసారి ఓడినా.. రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. మహిళలు ఎంత ఎదిగినా.. బండారు సత్యనారాయణమూర్తి వంటి కొంతమంది పురుషుల ఆలోచన ధోరణి మారట్లేదు. నా క్యారెక్టర్ ను ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్ల ఆడపిల్లలు వారి కలలను సాకారం చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటారు ” అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజెన్లు విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...
Oktelugu Epaper
Exit mobile version