Minister Roja: మంత్రి రోజా భావోద్వేగానికి గురయ్యారు. తనను టార్గెట్ చేస్తూ టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రోజా స్పందించారు. భావోద్వేగ ప్రకటనను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మంత్రి రోజా దూకుడుగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని డాన్సులు చేశారు. దీనిని టిడిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి.
చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల క్రమంలో రోజా వ్యవహరించిన తీరుపై టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు నాయకులు వచ్చే ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని.. మూడు నెలల వ్యవధిలోనే అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకు రోజాకు పంపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.అయినా సరే రోజా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణ లను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ వివాదంలో మంత్రి రోజా తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యర్థిగా మారారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి రోజాపై వ్యక్తిగత కామెంట్స్ చేశారు.
నందమూరి, నారా కుటుంబ సభ్యులపై నువ్వా విమర్శించేది అంటూ బండారు సత్యనారాయణమూర్తి విరుచుకుపడ్డారు. నీ గత జీవితం ఇది అంటూ వ్యక్తిగత విమర్శలు చేశారు. నువ్వు నటించిన వీడియోలు తమ వద్ద ఉన్నాయంటూ హెచ్చరికలకు దిగారు. దగ్గరే ఉండి ప్రోత్సహిస్తున్నారని సీఎం జగన్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో రాష్ట్ర మహిళా కమిషన్ కలుగజేసుకొని బిజెపికి లేఖ రాయడంతో… పోలీసులు బండారు సత్యనారాయణమూర్తి పై కేసులు నమోదు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి రోజాకు అండగా వైసీపీ నేతలు నిలవలేకపోయారని విమర్శలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో మంత్రి రోజా భావోద్వేగ ట్విట్ చేశారు. ” స్త్రీ ద్వేషులకు వ్యతిరేకంగా నేను కష్టపడి పని చేశా. ఒకసారి ఓడినా.. రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. మహిళలు ఎంత ఎదిగినా.. బండారు సత్యనారాయణమూర్తి వంటి కొంతమంది పురుషుల ఆలోచన ధోరణి మారట్లేదు. నా క్యారెక్టర్ ను ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్ల ఆడపిల్లలు వారి కలలను సాకారం చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటారు ” అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజెన్లు విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.
Forty years ago, I was told that I was working in a cutthroat, male-dominated world and that it would be difficult to make a mark as a woman. I worked tirelessly against entrenched misogynists. Though I faced defeat in two election, I persevered and won as an MLA for two… pic.twitter.com/qLkDFpkiPV
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 3, 2023