Ketika Sharma: మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన కేతిక శర్మను దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ చేశాడు. ఆయన కుమారుడు ఆకాష్ పూరికి జంటగా రొమాంటిక్ చిత్రం చేసింది కేతిక. ఇది ఆమెకు డెబ్యూ మూవీ. దర్శకుడు అనిల్ పాదూరి తెరకెక్కించగా పూరి కనెక్ట్స్ బ్యానర్లో ఛార్మి నిర్మించారు. ఇంటెన్స్ లవ్ డ్రామా రొమాంటిక్ చిత్రంలో కేతిక రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. సినిమాకు పాజిటివ్ టాక్ దక్కినా కమర్షియల్ గా ఆడలేదు.
అనంతరం ఆమెకు నాగ శౌర్య ఆఫర్ ఇచ్చాడు. లక్ష్య టైటిల్ తో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామాలో కేతిక నటించింది.నాగ శౌర్య ప్రొఫెషనల్ ఆర్చర్ రోల్ చేశాడు. లక్ష్య కూడా నిరాశపరిచింది. మచ్చగా మూడో ప్లాప్ రంగ రంగ వైభవంగా మూవీతో కంప్లీట్ చేసింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సైతం పరాజయం పొందింది. ఇక ఆఫర్స్ కష్టమే అనుకుంటున్న తరుణంలో బ్రో ఛాన్స్ వచ్చింది.
పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో చిత్రంలో సాయి ధరమ్ కి జంటగా కేతిక శర్మ నటించింది. ఆమె పాత్ర నిడివి తక్కువే. అయితే పెద్ద సినిమా ఆఫర్ పట్టేసింది. బ్రో హిట్ టాక్ తెచ్చుకుంది. అలా మొదటి హిట్ ఖాతాలో వేసుకుంది కేతిక. అయితే ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. ప్రస్తుతం అధికారికంగా చేతిలో ఒక్క ప్రాజెక్ట్ లేదు. అందుకే అయోమయంలో పడింది. అయితే ఓ ఇంటర్వ్యూలో కేతిక ఆసక్తికర కామెంట్స్ చేశారు.
పరిశ్రమలో బాడీ షేమింగ్ చేసేవాళ్ళు అడుగడుగునా తగులుతారన్న కేతిక శర్మ తనకు కూడా ఆ అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది. మోడలింగ్ చేసేటప్పుడు తన ఎద భాగం పెద్దగా ఉండటాన్ని కొందరు ఎగతాళి చేశారట. వాటి సైజు కొబ్బరి బొండాలు అంత ఉందంటూ కామెంట్స్ చేసేవారట. అలాంటి కామెంట్స్ విన్నప్పుడు బాధేసేది. అయినా నాకు నేను నచ్చజెప్పుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాను. ఈ స్థాయికి రాగలిగాను, అని కేతిక శర్మ చెప్పుకొచ్చింది. కేతిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram